close

తాజా వార్తలు

Published : 28/10/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ​​​​​తొలి వ్యాక్సిన్లపై అనుమానాలు..!

యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ మాత్రమేనని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా టీకా అందుబాటులోకి రావాలని ప్రతిఒక్కరూ ఆశిస్తున్నారు. గతంలో మరే వ్యాధికీ ఇంత త్వరగా టీకా రావాలని ఆశించిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో ఏర్పాటైన ప్రత్యేక కార్యదళం ఛైర్మన్ కేట్‌ బింగమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గుర్తుంచుకోండి..మొదట ఓటు వేయండి: మోదీ

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం మొదటి దశ పోలింగ్ ప్రారంభం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర వాసులకు పలు సూచనలు చేశారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలని, అందరు మాస్క్ ధరించాలని కోరారు. ‘బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు  మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాను. రెండు గజాల దూరాన్ని పాటించడంతో పాటు, తప్పకుండా మాస్క్‌ ధరించాలి. గుర్తుంచుకోండి.. మొదట ఓటు వేయండి, తరవాత రిలాక్స్‌ అవ్వండి’ అంటూ ట్విటర్ వేదికగా  బిహార్‌ మొదటి దశ పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌లో క్రియాశీల కేసులు 7.64% మాత్రమే..

భారత్‌లో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కేసుల సంఖ్యలో కాస్త పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 10,66,786 పరీక్షలు నిర్వహించగా.. 43,893 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఈ సంఖ్య 36,469గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 79,90,322కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 508 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,20,010కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 1,481 కరోనా కేసులు

4. ఏపీలో స్థానిక ఎన్నికలపై అభిప్రాయ సేకరణ

ఏపీలో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ సేకరించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు  నిర్వహిస్తున్న దృష్ట్యా గతంలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్టు నిమ్మగడ్డ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై చర్యలు

గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఓవైపు పబ్లిక్‌ పోలీసింగ్‌ అంటూ మరో వైపు అన్నదాతల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగిన నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రైతులను తీసుకెళ్లిన ఆరుగురు ఎస్కార్ట్‌ హెడ్‌ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఐ, ఆర్‌ఐలకు ఎస్పీ విశాల్‌ గున్నీ ఛార్జి మెమోలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రంగంలోకి దిగిన మెలానియా ట్రంప్‌..

అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తొలిసారి ప్రచార రంగంలోకి దిగారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం జరిగిన ఓ ప్రచార సభలో తన భర్త, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ఆమె స్వయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ఓ నిజమైన ఫైటర్‌ (యోధుడు) అని మెలానియా ప్రశంసించారు. రెండో విడత అధ్యక్షుడయ్యేందుకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఊపిరాడక ఇబ్బందిపడ్డా: నాగబాబు

కరోనా వైరస్‌తో పోరాటం చేసి.. ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చారు నటుడు నాగబాబు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో తాను ఏవిధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాననే విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించినా సరే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘కరోనాని జయించిన యోధుడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమే. ఆస్తమా ఉన్న కారణంగా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారుపడ్డా. ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించండి’ అని నాగబాబు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌నియంత్రణకు వాయు కాలుష్యమే అడ్డంకి!

8. కాగ్నిజెంట్‌ ఇండియా సీఎండీగా రాజేశ్‌ నంబియార్‌

ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తమ భారత కార్యకలాపాలకు ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాజేశ్ నంబియార్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యుడిగానూ చేరుస్తున్నట్లు తెలిపింది. నవంబరు 9 నుంచి ఆయన నియామకం అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన నెట్‌వర్కింగ్‌, సిస్టమ్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సియెనా ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. షారుక్‌ మీ ఇల్లు మన్నత్‌ అమ్ముతారా?

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తన అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’ అంటూ మంగళవారం సాయంత్రం ట్విటర్‌ చాట్‌ సెషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగితే.. మరికొందరు ట్రోల్‌ చేస్తూ ట్వీట్లు పెట్టారు. వీటికి షారుక్‌ తన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. ‘భాయ్‌... మన్నత్‌ను (షారుక్‌ ఇల్లు) అమ్మేందుకు ప్రయత్నిస్తున్నావా?’ అని ప్రశ్నించారు. దీనికి షారుక్‌ స్పందిస్తూ.. ‘బ్రదర్‌, ‘మన్నత్’ను అమ్మలేం. ’ అని పేర్కొన్నారు. ఇలా ఫాలోవర్స్‌కు, ఆయనకు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐపీఎల్‌‌: యాంటీ క్లైమాక్స్‌ ఎవరికి?

ఇండియన్‌ టీ20 లీగు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా తయారవుతోంది. ప్లేఆఫ్స్‌ ఇక ఖాయమే అనుకున్న జట్లు అనూహ్యంగా ఓటమి పాలవుతున్నాయి. ఇక పనైపోయిందనుకున్న పట్టికలోని కింది జట్లు విజయ ఢంకా మోగిస్తున్నాయి. మ్యాచు మ్యాచుకూ పరిస్థితులు తారుమారు అవుతుండటంతో నాకౌట్‌కు చేరుకొనే నాలుగో జట్టేదో ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. తాజాగా దిల్లీపై హైదరాబాద్‌ విజయదుందుభి మోగించడంతో సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.