close

తాజా వార్తలు

Updated : 24/11/2020 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. భాజపా..దేశాన్ని అమ్మేస్తోంది: కేటీఆర్‌

 భారతీయ జనతాపార్టీ భారతదేశాన్ని అమ్మేస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారత దేశంలో ముస్లింలపై భాజపాకు ఎంత విధ్వేషం ఉందో అందరికీ అర్థమవుతోందన్నారు. లోయర్‌ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది భాజపా కాదా?అని ప్రశ్నించారు. ఇటీవల తెరాసపై ఛార్జిషీట్‌ విడుదల చేసిన భాజపాకు కేటీఆర్‌కు 50 ప్రశ్నలు సంధించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బస్తీమే సవాల్‌.. జోరుగా ప్రచారం: లైవ్‌ బ్లాగ్‌

2. దూసుకొస్తున్న నివర్‌ తుపాను

తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనున్న నివర్‌ తుపాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి  ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కొద్దిగంటల్లో తుపానుగా తరువాత 12 గంటల్లో తీవ్ర తుపానుగాను మారుతుందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విదేశాంగమంత్రిగా బ్లింకెన్‌.. జాన్‌కెర్రీకి పర్యావరణం

అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తయ్యింది. కేబినెట్‌లో కొందరి పేర్లను బైడెన్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అమెరికా భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించారు. కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు అప్పగించారు. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ను ఎంపికచేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి లాటినో వ్యక్తి ఈయనే కావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్‌ సలహాదారుడు జేక్‌ సులివాన్‌ను నియమించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మోండామార్కెట్‌కు ఎన్నేళ్లు.. ఖైరతాబాద్‌ కహాని ఏంటి.?

నగరంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంది. ఆయా ప్రాంతాలకు పేరు పెట్టడంలోనూ అనేక అంశాలు దాగున్నాయి. ఆనాటి నుంచి ఇవి నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూనే ఉన్నాయి. నాటి వైభవాన్ని నేటికి చాటుతూ భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేస్తున్నాయి. వాటిలో కొన్నింటి విశిష్టతల గురించి తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దేశంలో మళ్లీ 40వేల దిగువకు కొత్త కేసులు

 భారత్‌లో గత కొన్ని రోజులు నుంచి కలవరపెడుతున్న కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులు కోలుకున్న వారి కంటే కొత్త వైరస్‌ కేసులే ఎక్కువగా ఉండగా.. తాజాగా రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. ఇక కొత్త కేసులు కూడా మళ్లీ 40వేల దిగువన నమోదయ్యాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆపద బుస కొడితే.. కలసి పని పట్టాయ్‌..

వీధికుక్కల దాడిలో తాచుపాము హతమైన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం గుడివాకవారిపాలెంలో జరిగింది. కుక్కలు దాడిచేయబోగా పాము పడగవిప్పి వాటిని కాటేసేందుకు ప్రయత్నించింది. కుక్కలు దాన్ని ఎటూ కదలకుండా చేశాయి. ఈ క్రమంలో ఓ శునకం పాముతోక పట్టింది. దీంతో మిగతావి కూడా దానిపై పడి కరిచాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘హిందువా.. ముస్లిమా కాదు.. వారు మేజర్లు’

దేశవ్యాప్తంగా లవ్‌ జిహాద్‌, మతాంతర వివాహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వివాహాల్లో హిందువా, ముస్లిమా అనేది న్యాయస్థానం చూడదని.. కేవలం వారు మేజర్లా కాదా అనేదే ముఖ్యమని తెలిపింది. మేజర్లకు వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. ఇద్దరు మేజర్ల మధ్య బంధాన్ని ఏ వ్యక్తి గానీ, కుటుంబం గానీ, రాష్ట్రం గానీ వ్యతిరేకించకూడదని స్పష్టం చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గేట్స్‌ను వెనక్కి నెట్టిన మస్క్‌!

ఎలన్‌ మస్క్‌ సంపద రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. దీంతో సోమవారం ఆయన బ్లూమ్‌బెర్గ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. ఆయన స్థాపించిన టెస్లా సంస్థ షేర్ల ధర భారీగా పెరగడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మస్క్‌ సంపద 7.2 బిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 127.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రుణ మాఫీ..పన్ను తగ్గింపు..ఇప్పుడు ఇది:రాహుల్‌ 

ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్లను అనుమతించాలంటూ రిజర్వు బ్యాంకు కార్యాచరణ బృందం చేసిన సిఫారసులను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ‘కాలక్రమాన్ని అర్థం చేసుకోండి’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘కాలక్రమాన్ని అర్థం చేసుకోండి: తొలుత కొన్ని బడా కంపెనీలకు రుణమాఫీ; తర్వాత కంపెనీలకు పన్ను తగ్గింపు; ఇప్పుడు, వీరు నెలకొల్పబోయే బ్యాంకులకు నేరుగా ప్రజలు ఆదా చేసుకున్న సొమ్మును అప్పగించడం’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోహ్లీ మంచి కెప్టెనే కానీ రోహిత్‌ అత్యుత్తమం 

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ మరోసారి బోల్తాపడగా, ముంబయి ఐదోసారి విజేతగా నిలిచింది. దీంతో అప్పటి నుంచీ టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో ఎప్పటి నుంచో కోహ్లీ సారథ్యాన్ని విమర్శిస్తున్న మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన వ్యాఖ్యలకు పదునుపెట్టాడు. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో ఆకాశ్‌చోప్రా, పార్థివ్‌ పటేల్‌తో మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జాంటీరోడ్స్‌ ఈ క్యాచ్‌ను చూస్తే గర్వపడతాడు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన