close

తాజా వార్తలు

Updated : 27/11/2020 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. దిల్లీ శివారుల్లోకి అన్నదాతలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ నిరసన ర్యాలీ శుక్రవారమూ కొనసాగుతోంది. హరియాణా, పంజాబ్‌ నుంచి వచ్చే రహదారుల్లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించినప్పటికీ.. అన్నదాతలు దిల్లీ శివారుల్లోకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను సైతం తొలగించుకుంటూ ముందుకు నడిచారు.  హరియాణాలోని పానిపట్‌ వద్ద అర్ధరాత్రి పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువు, జల ఫిరంగులను సైతం లెక్క చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మీ ఓటుతో మద్దతు పలకండి: కేటీఆర్‌

హైదరాబాద్‌ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస సర్కారు కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగిందని కేటీఆర్‌ తెలిపారు. నగరంలో పచ్చదనం పెంచేలా 934 కాలనీ పార్కులు, 460 ట్రీ పార్కులు, 58 థీమ్‌ పార్కులు, ప్లే పార్కులు, ట్రాన్సిట్‌ పార్కులు ఇలా అనేకం అభివృద్ధి చేశామని .. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 12 కోట్ల మొక్కలు నాటామని కేటీఆర్‌ వివరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

3. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోను.. అది నా హక్కు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌ మహమ్మారి విషయంలో ముందునుంచీ అలసత్వంగానే ఉన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో ఇప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్న రెండో దేశం బ్రెజిలే అయినప్పటికీ.. వ్యాక్సిన్‌పై ఇంకా విముఖత చూపిస్తూనే ఉన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేదే లేదంటున్న బొల్సొనారో.. అది తన హక్కు అని చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6కోట్లు దాటిన వైరస్‌ కేసులు 

4. ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై అదనపు పరీక్షలు..!

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వైరుధ్యం తలెత్తడంతో నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సమర్థతను తేల్చేందుకు మరోసారి ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో పాస్కల్‌ సోరియట్‌ తెలిపారు. అయితే, ఇప్పటికే జరుగుతున్న ప్రయోగాలకు.. ఇవి అదనం అని స్పష్టం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అల్పపీడనంగా మారిన వాయుగుండం 

నివర్‌ తుపాను తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తిరుపతి సమీపంలో బలహీనపడ్డ నివర్‌ తుపాను శుక్రవారం ఉదయం వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం కోస్తాంధ్రపై ఆవరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సముద్రంలో కూలిన మిగ్‌ శిక్షణ విమానం 

 భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం సముద్రంలో కుప్పకూలింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నేవీ అధికారులు నేడు వెల్లడించారు. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉండగా.. ఒక పైలట్‌ను కాపాడినట్లు అధికారులు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే: లైవ్‌ బ్లాగ్‌ 

లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

8. కరోనా ఆందోళనకు.. 45నిమిషాల సూత్రం! 

కరోనా భయం వెంటాడుతోందా? మిత్రులను, బంధువులను కలవలేకపోతున్నామని.. మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నామని బెంగ పడుతున్నారా? ఇవన్నీ ఆందోళన, కుంగుబాటు లక్షణాలకు దారితీస్తున్నాయా? అయితే ‘45 నిమిషాల సూత్రం’ పాటించండి. ఇది చాలా తేలికైనది. చాలామంది ఆచరించదగినదీనూ. దీన్ని అనుసరిస్తే ఆందోళన, కుంగుబాటు మూలంగా తలెత్తే ప్రతికూల భావనల నుంచి బయటపడటం తథ్యమన్నది చైనా పరిశోధకుల సూచన.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

93.65 శాతానికి చేరిన రికవరీ రేటు..

9. నేటి నుంచి డీబీఎస్‌ పేరుతో లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌..!

నేటి నుంచి లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ శాఖలు మొత్తం సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంక్‌ భారతీయ విభాగాల కిందకు వచ్చాయి. దీంతో ఈ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఇప్పుడు రూ.25,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మెగాస్టార్‌..?

ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ గురించి ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి సైతం భాగం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఈ సినిమాలో వెండితెరపై కనిపించకుండానే ప్రేక్షకులను మెప్పించనున్నట్లు సమాచారం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన