close

తాజా వార్తలు

Published : 28/11/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. చట్టాల్ని వెనక్కితీసుకునే వరకు ఆందోళనే: రైతులు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన శనివారమూ కొనసాగుతోంది. చట్టాలకు వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. బురారీలోని నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించినా.. పంజాబ్‌-హరియాణాకు చెందిన రైతులు సింఘులో ఇంకా తమ నిరసనను విరమించలేదు. అక్కడే బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జైడస్‌ బయోటెక్‌ పార్క్‌లో మోదీ

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు నగరాల పర్యటన ప్రారంభమైంది. శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్న మోదీ.. అక్కడి జైడస్‌ క్యాడిలా బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డి’ టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్‌ ధరించి వ్యాక్సిన్‌ ప్రయోశాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాల్లో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వేసవి నాటికి 10 వ్యాక్సిన్లు

3. ముంబయి దాడుల సూత్రధారిపై అమెరికా భారీ రివార్డు

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి సాజిద్‌ మీర్‌ తలపై అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. మారణహోమం జరిగి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఐదు మిలియన్‌ డాలర్లు అందజేస్తామని తెలిపింది. ముంబయి పేలుళ్లలో పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన సాజిద్‌ మీర్‌దే ప్రధాన పాత్ర అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏడాదిన్నరలో రూ.లక్ష కోట్ల దోపిడీ: యనమల

 సీఎం జగన్‌ పేదల రక్తాన్ని జలగ పీల్చినట్టు పీల్చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మొత్తం జే గ్యాంగ్‌ జేబుల్లోకి పోతోందని, పేదలపై మాత్రం పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. జగన్‌ ఏడాదిన్నరలోనే పన్నులు, ఛార్జీల పెంపు ద్వారా రూ.70వేల కోట్ల భారం మోపి పేదల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పవన్‌పై ప్రకాశ్‌రాజ్‌ విమర్శ‌.. నాగబాబు కౌంటర్‌!

నాయకుడిగా పవన్‌కల్యాణ్‌ సొంత పార్టీని స్థాపించి.. భాజపాకు మద్దతు తెలపడం తనకి నచ్చలేదని నటుడు ప్రకాశ్‌రాజ్‌ విమర్శించిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భాగంగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌, భాజపా గురించి ప్రకాశ్‌రాజ్‌ పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశ్‌రాజ్‌ చేసిన విమర్శలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మధుమేహులూ.. మరింత జాగ్రత్త! 

ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా కరోనా జబ్బు మీదే. అలాగని ఇతర జబ్బులపై.. ముఖ్యగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 42.2 కోట్ల మంది మధుమేహం బారినపడుతుండగా.. దాదాపు 16 లక్షల మంది దీంతో మృత్యువాత పడుతున్నారు. మనదేశంలో 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొత్త కేసులు.. రికవరీలు 40వేల పైనే

భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చలికాలం ప్రవేశించడం, ప్రజలు కొవిడ్-19 నిబంధనలు సరిగా పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు 40వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం 41,322 వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 753 కరోనా కేసులు

8. జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలతో చెక్‌ చెప్పండి!

19 ఏళ్ల వయస్సులో జుట్టు రాలటం మొదలైతే! 25ఏళ్లలో జుట్టు పలచబడితే! 35వ ఏటే బట్టతల వచ్చేస్తే.. ఇలా భయపడుతున్న వారెందరో..! ఇప్పుడు కుర్రకారు చెప్పుకోలేని బాధ.. తీరని వ్యథ.. నలుగురిలో తిరగాలన్నా, అందంగా కనిపించాలన్నా ఒత్తైన జుట్టు ఉండాల్సిందే. మరి ఈ మధ్య మీ జుట్టు రాలుతోందా? చేతులతో తాకితేనే ఊడుతోందా! అందుకు వంశపారంపర్యం, నిద్ర సమస్యలు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి ఇలా అనేక కారణాలుండొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘సాహో’ సాంగ్స్‌ మేకింగ్‌ చూశారా..!

 ప్రభాస్‌ కథానాయకుడిగా సూజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని లొకేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఏ చోట నువ్వున్నా’ అనే పాటలో చూపించిన మంచు పర్వతాలు సినీ ప్రేమికుల్ని మరెంతగానో ఆకర్షించాయి. అయితే, తాజాగా ‘సాహో’ సినిమా పాటల మేకింగ్‌కు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆస్ట్రేలియాలోని ఇన్స్‌బ్రక్‌లో జరిగిన షెడ్యూల్‌ గురించి ఈ వీడియోలో చూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టీమ్‌ఇండియాను హడలెత్తించారు..

తొమ్మిది నెలల తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. అటు బౌలింగ్‌, ఇటు ఫీల్డింగ్‌ విభాగాల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీసేన ఛేదనలో మరింత వెనుకపడింది. ధాటిగా ఆడే శక్తి సామర్థ్యాలున్నా కీలక బ్యాట్స్‌మెన్‌ మైదానంలో నిలువలేకపోయారు. ఎప్పటిలాగే బౌన్సీ పిచ్‌ను ఎదుర్కోవడంలో చిత్తయ్యారు. దీంతో కంగారూలు సంపూర్ణ ఆధిపత్యం చలాయించి ఈ సీజన్‌లో బోణీ కొట్టారు. ఈ క్రమంలోనే వారు టీమ్‌ఇండియాపై మునుపెన్నడూ లేని విధంగా వన్డేల్లో అత్యధిక స్కోర్‌ సాధించారు. అయితే, భారత జట్టుపై ఇతర జట్లు ఇంతకన్నా ఎక్కువ పరుగులే చేశాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని