
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. తాజా చట్టాలతో రైతులకు మరిన్ని అవకాశాలు
నూతన వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాల్ని దూరం చేసి వారికి కొత్త అవకాశాలు, హక్కుల్ని కల్పిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాతే పార్లమెంటులో వాటికి చట్టబద్ధత లభించిందని తెలిపారు. అతి తక్కువ సమయంలో రైతులు వీటి ఫలాల్ని అందుకుంటున్నారన్నారు. రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో భారీ ఎత్తున ఆందోళన కొనసాగిస్తుండగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నానిపై ఓ దుండగుడు దాడికి యత్నించాడు. ఆదివారం ఉదయం పేర్ని నాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా మచిలీపట్నానికి చెందిన తాపీ మేస్త్రి నాగేశ్వరరావు దాడికి యత్నించాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన మంత్రి అనుచరులు నాగేశ్వరరావును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షాతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి
4. లక్షణాలు ఉన్న వారితోనే వ్యాప్తి అధికం!
లక్షణాలు లేని వారి కంటే ఉన్నవారు నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. అలాగే కొవిడ్ బాధితులతో నివాసం పంచుకునే వారు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ముప్పు ఎక్కవగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగానే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచడం చాలా ముఖ్యమని.. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* 42,298 రికవరీలు.. 41,810 కొత్త కేసులు
5. బాలుడిని చిదిమేసిన లిఫ్టు గ్రిల్స్
ముంబయిలోని ధారావిలో విషాదం చోటుచేసుకుంది. కోజీ షెల్టర్ భవనంలో ఐదేళ్ల బాలుడు లిఫ్టు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇతర పిల్లలతో కలిసి కింది అంతస్తుకు వెళ్లేందుకు మహమ్మద్ హుజైఫ్ సర్ఫరాజ్ షేక్ అనే బాలుడు లిఫ్టు ఎక్కాడు. ఆ లిఫ్టుకు గ్రిల్స్‌తోపాటు దాని వెనక డోర్ కూడా ఉంది. గ్రిల్స్‌తోపాటు తలుపు మూసుకోగానే లిఫ్టు కదులుతుంది. అయితే లిఫ్టు కింది అంతస్తుకు చేరుకోగానే మిగతా ఇద్దరు పిల్లలు గ్రిల్స్, డోర్ తెరుచుకొని బయటకు వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధన కొనసాగుతుంది
వచ్చే ఏడాది జులై కల్లా 30 కోట్ల మంది ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ ద్వారా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ ఆన్లైన్ సెమినార్లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మంజీరాలో దూకిన అరుణ మృతదేహం లభ్యం
నాలుగు రోజుల క్రితం మనూర్ మండలం రాయిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యవసాయ అధికారిణి అరుణ మృతదేహం ఉదయం లభ్యమైంది. నాలుగు రోజుల నుంచి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టగా ఇవాళ ఉదయం ఆరుణ మృతదేహాన్ని మంజీరాలో గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పన్ను ఆదాయం రూ.2.6 లక్షల కోట్లు తగ్గొచ్చు
దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజితం అవుతున్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు లక్ష్యం కంటే రూ.2.6 లక్షల కోట్ల మేర తగ్గొచ్చని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 2020-21 బడ్జెట్లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లుగా పేర్కొన్న సంగతి విదితమే. ‘గత ఆర్థిక సంవత్సరానికి సవరించిన పన్ను వసూళ్ల మొత్తానికి సమానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైనా సంతోషమే. అయితే అంతకంటే తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నాం’ అని సదరు అధికారి తెలిపినట్లు వార్తాసంస్థ కోజెన్సీస్ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఓటీటీ ఆఫర్ వాస్తవమే: మాస్టర్ టీమ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మాస్టర్’ రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొని ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ తరుణంలో సినిమా విడుదల గురించి చిత్రబృందం అధికారికంగా స్పందించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* తాప్సీని బీ గ్రేడ్ నటి అంటోన్న ప్రముఖ నటి సోదరి
10. ఇలాంటి జట్టుతో భారత్‌కు ప్రపంచకప్పా?
భారత్ బ్యాటింగ్ లైనప్‌లో లోతు లేదని, ప్రస్తుత జట్టుతో ప్రపంచకప్ గెలవడం కష్టమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. ‘‘ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం లేకపోవడమే భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. ఆ జట్టుకు కనీసం ఆరు లేదా ఏడుగురు బౌలర్లు ఉండాలి. బ్యాటింగ్ లైనప్‌లో లోతు లేకపోవడం కూడా ఆ జట్టుకు సమస్యే’’ అని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
