close

తాజా వార్తలు

Published : 30/11/2020 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. థ్రిల్లర్‌: ఇరాన్‌లో ‘మొస్సాద్‌’ వేట..!

శుక్రవారం మూడు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఇరాన్‌లోని అబ్సార్డ్‌ పట్టణంలో ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ భారీ పేలుడు.. ఏం జరుగుతోందో తెలిసేలోపే మధ్యలోని కారు వద్దకు ఆగంతకులు చేరుకొని విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించారు. ఆ కారులోని వీవీఐపీ మరణించినట్లు ధ్రువీకరించుకొని వెళ్లిపోయారు. ఈ ఘటన ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ. ఆ చనిపోయిన వీవీఐపీ ఎవరో కాదు.. ఆ దేశ అణుకార్యక్రమ పితామహుడిగా భావించే మొసిన్‌ ఫక్రిజాద్‌..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇంకా దిల్లీ సరిహద్దుల్లోనే అన్నదాతలు 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన ఐదో రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది రైతులు దిల్లీ శివారుల్లోని సంఘి, టిక్రీ రహదారుల్లోనే బైఠాయించారు. దీంతో ఈ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దిల్లీ సరిహద్దుల్లో ఉండకుండా శివారులోని బురాడిలో ఉన్న మైదానానికి వెళ్లి ఆందోళన కొనసాగిస్తే చర్చలు జరుపుతామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనను అభ్యర్థులు తిరస్కరించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రజనీకాంత్‌ కీలక భేటీ ప్రారంభం

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ‘రజనీ మక్కళ్‌ మండ్రం’ నిర్వాహకులతో కీలకంగా భేటీ అయ్యారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమయ్యారు. రాజకీయ అరంగేట్రంపై చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో బలపడనుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రానికి శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశమున్నట్లు తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో దక్షిణ కోస్త జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఇవాళ విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన కోటాను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో నిత్యం 19 వేలు ఇవ్వనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఫొటో గ్యాలరీ: కార్తిక సోమవారం..శివాలయాలు శోభాయమానం

6. రైతులను ఆదుకోవాలి: చంద్రబాబు

పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వరి కంకుల్ని చేతబట్టి తెదేపా నేతలు సచివాలయం సమీపంలో నిరసన తెలిపారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల తరఫున ఆందోళనలు చేశారు. అన్నదాతలకు కలిగిన నష్టాన్ని తెలిపే రీతిలో వర్షానికి దెబ్బతిన్న పంట కంకులతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పండగ రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదం!

ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న అమెరికాలో రానున్న రోజుల్లో కొత్త కేసులు మరింత వెల్లువలా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. క్రిస్మస్‌‌, థ్యాంక్స్‌ గివింగ్‌ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు భారీ ఎత్తున సమావేశమయ్యే అవకాశం ఉండడమే దీనికి కారణమని తెలిపారు. ఇప్పటికే అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 13 మిలియన్లు దాటింది. వీరిలో 2,65,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరోసారి 40 వేల దిగువకు కొత్త కేసులు

8. ఐపీఓలు అదరగొట్టాయ్‌

ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)ల మార్కెట్‌ కళకళలాడింది. డజనుకు పైగా కంపెనీలు రూ.25,000 కోట్లు సమీకరించి అదరగొట్టాయి. అధిక నగదు లభ్యతకు తోడు మదుపర్లు మంచి ఆసక్తి ప్రదర్శించడం కంపెనీలకు కలిసొచ్చిందని, వచ్చ ఏడాది కూడా ఐపీఓ విపణి ఇంతే బలంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఫార్మా, టెలికమ్యూనికేషన్, ఐటీ, ఆర్థిక సేవలు వంటి వివిధ రంగాల కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు రావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐఏఎస్‌ కావాలని.. కాపీ రైటర్‌గా పనిచేసి..!

బాల్యంలో గాయని కావాలనుకుంది. వయసు పెరిగే కొద్దీ పుస్తకాల పురుగ్గా మారింది. చదువులో టాపర్‌గా నిలిచింది. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా మారి.. ప్రజలకు సేవలందించాలని కలకంది. తానొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్లు.. ఆమె కెరీర్‌ ఊహించని మలుపు తిరిగింది. కాలం ఆమెను అందరూ మెచ్చే కథానాయికను చేసింది. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తోనే కుర్రకారు కలల రాణిగా మారిన రాశీ ఖన్నా గురించేనండీ ఇదంతా.. సోమవారం ఈ అందాల భామ జన్మదినం. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆస్ట్రేలియా అభిమానులకు చేదు వార్త..

వరుసగా రెండు వన్డేల్లో టీమ్‌ఇండియాపై అర్ధశతకాలతో రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆదివారం రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ అతడు గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల్లో నొప్పితో మైదానంలోనే విలవిల్లాడడంతో వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా జట్టు వైద్య బృందం వార్నర్‌ను బయటకు తీసుకెళ్లింది. అనంతరం వైద్య పరీక్షలు చేయగా తీవ్రగాయమైనట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వార్నర్‌ గాయం ఎక్కువ రోజులుంటే బాగుండు


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని