close

తాజా వార్తలు

Updated : 05/03/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. విజయవంతంగా ‘ఉక్కు’ బంద్‌

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఉక్కు’ సంకల్పంతో బంద్‌ నిర్వహిస్తున్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్‌ కొనసాగుతోంది. భాజపా మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు సహకరించాయి. ‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు’ అని నినదించాయి. విద్యా, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. చెదురు మదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బంద్‌లో పాల్గొని..వ్యాఖ్యాతగా విజయసాయిరెడ్డి

2. యూఎస్‌పై భారత సంతతి ఆధిపత్యం: బైడెన్

అమెరికాలో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. దేశ పాలనలో కీలక పదవులను అధిరోహించి..తమ దేశంపై వారు పట్టు పెంచుకుంటున్నారని ప్రశంసించారు. అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలతో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఉక్కు’ ఆందోళనలో తెదేపా, వైకాపా బాహాబాహీ

‘ఉక్కు’ ఆందోళన సందర్భంగా కృష్ణా జిల్లా కైకలూరులో వైకాపా, తెదేపా శ్రేణులు బాహాబాహీకి దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో కైకలూరులో తెదేపా, వైకాపా, వామపక్ష శ్రేణులు బంద్‌లో పాల్గొన్నాయి. అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీ ప్లెక్సీ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈక్రమంలో తెదేపా ఇన్‌ఛార్జి జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ప్లెక్సీని వైకాపా కార్యకర్తలు చించేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బస్కీలు తీసినా.. స్కూటీ ఎక్కినా ఓట్లకోసమే

ఎన్నికల పండగ వచ్చిందంటే రాజకీయ వేడి రాజుకుంటుంది. గెలుపు కోసం నేతల ఎత్తులు.. అభ్యర్థుల పరస్పర వాగ్బాణాలు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల జడివానలు షరామామూలే. త్వరలో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈసారి నేతలు తమ పంథా కొంచెం మార్చారు. ఓవైపు హామీలు కురిపిస్తూనే ప్రజలతో మమేకమయ్యేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఒకరు స్కూటీ ఎక్కితే.. మరొకరు బస్కీలు తీశారు. ఇంకొకరు కూలీగా మారారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒక్క సెల్ఫీ.. జైల్లో 600 తాళాలను మార్చేసింది!

నేటి యువతకు సెల్ఫీలపై ఉన్న మోజు ఏపాటిదో చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫీల కోసం వింతవింత ప్రయోగాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిని సైతం మనం చూస్తున్నాం. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేయడం నేటి యువతరం లక్షణాల్లో ఒకటి. అందులో తప్పేం లేదు. కానీ, వెళ్లిన చోటు ఎలాంటిదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. ఒక్క ఫొటోతో ఎన్నో విషయాలు బయటపడతాయని సైబర్‌ నిపుణులు చెబుతుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా మరణాలు@113

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం 7,61,834 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..16,838 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,73,761కి చేరుకుంది. మూడు రోజుల అనంతరం తాజాగా మరణాల సంఖ్య 100 దాటింది. గడిచిన 24 గంటల్లో 113 మంది వైరస్‌కి బలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సుశాంత్‌ కేసు.. 33 మంది పేర్లతో ఛార్జిషీట్‌!

 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతికి సంబంధించి డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ (నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. 33 మంది పేర్లతో ప్రత్యేక కోర్టుకు ఎన్‌సీబీ ఛార్జిషీట్‌ సమర్పించింది. 200 మంది సాక్షుల వాంగ్మూలాలను ఇందులో జోడించింది. సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితోపాటు మాదకద్రవ్యాలు సరఫరా చేసే పలువురు వ్యక్తుల పేర్లు కూడా ఈ ఛార్జిషీట్‌లో నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

క్యాస్టింగ్‌ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!

8. నెలకు  రూ.8వేలు  రావాలంటే...

నెలకు రూ.8 వేల వరకూ రాబడి రావాలంటే.. దాదాపు 6 శాతం సగటు వడ్డీ వచ్చే పథకాల్లో రూ.16లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి రూ.4.5లక్షలు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం (ఎంఐఎస్‌)లోనూ, మిగతా   రూ.11.50లక్షలను బ్యాంకులో నాన్‌ క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. ఈ మొత్తాన్ని ఒకే  డిపాజిట్‌గా కాకుండా.. మూడు భాగాలుగా విభజించి జమ చేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రైల్వేస్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలు

దేశవ్యాప్తంగా 4000 రైల్వేస్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలను రైల్‌టెల్‌ ప్రారంభించింది. ఆయా రైల్వేస్టేషన్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ఈ సేవలను ప్రారంభించామని రైల్‌టెల్‌ పేర్కొంది. ఇప్పటికే 5950 రైల్వేస్టేషన్లలో 1 ఎంబీపీఎస్‌ వేగంతో 30 నిమిషాల వరకు ప్రయాణికులకు ఉచిత వైఫై అందిస్తున్నామని తెలిపింది. అయితే ఇంటర్నెట్‌ వేగాన్ని 34 ఎంబీపీఎస్‌కు పెంచి పరిమిత రుసుముతో సేవలందిస్తామని ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోహ్లీ ఖాతాలో అనవసరపు రికార్డు.. 

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఖాతాలో ఓ అనసవరపు రికార్డు నమోదైంది. అది కూడా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరసన చేరడం గమనార్హం. మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ శుక్రవారం డకౌటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ విసిరిన ఓ షార్ట్‌పిచ్‌ బంతిని వేటాడబోయి కీపర్‌ ఫోక్స్‌ చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 41 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాక్‌ పరువు తీశారు: అక్తర్‌ Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని