close

తాజా వార్తలు

Published : 16/09/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. చైనా సరిహద్దుల్లో 200 రౌండ్ల కాల్పులు..?

భారత్‌ కీలకమైన బ్లాక్‌టాప్‌ శిఖరాన్ని స్వాధీనం చేసుకొన్నాక పాంగాంగ్‌ సరస్సు వద్ద చాలా కీలక పరిణామాలు చోటుచేసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. సరస్సు దక్షిణ భాగంలో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించడంతో చైనా దళాలు ఉత్తర భాగంలో దురుసుగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. చుషూల్‌ సబ్‌ సెక్టార్‌లో బయటకు చెబుతున్న దానికన్నా... తీవ్రస్థాయిలోనే పాంగాంగ్‌ వద్ద కాల్పులు జరిగాయని ఓ అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారి వెల్లడించినట్లు ‘ఆంగ్లపత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’  సంచలన కథనం వెలువరించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సిట్‌ తదుపరి చర్యలు ఆపండి: హైకోర్టు

రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సిట్‌ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిపై ఏర్పాటు చేసిన సిట్‌, గత ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ తెదేపా నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.  శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్‌, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్‌ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రైల్వే ప్రయాణికులకు శుభవార్త!

భారత రైల్వేశాఖ ప్రయాణికులకు మరో శుభావార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని కొత్త రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కొత్త మరో 40 సమాంతర రైళ్లు(క్లోన్‌ ట్రైన్స్‌) నడపనున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెల 21 నుంచి పట్టాలెక్కనున్నాయి. రైల్వే శాఖ నిర్దేశించిన సమయంలో ఇవి పరుగులు పెట్టనున్నాయి. వీటిలో ప్రయాణించాలంటే ముందుగా రిజర్వేషన్‌ తప్పనిసరి. తక్కువ స్టాపుల్లో ఆపడం వీటి ప్రత్యేకత. ఇప్పటికే సెప్టెంబర్ 12 నుంచి రైల్వేశాఖ 80 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీటికి అదనంగా మరో 40 సమాంతర రైళ్లను నడుపనున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా విలయం: 50లక్షలు దాటిన కేసులు!

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 11,16,842 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 90,122 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,20,359కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 39లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 95వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 82వేల మంది కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులో 1290 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అతను ‘ఏదో’ తీసుకుంటున్నాడు: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులపై మరింత తీవ్రంగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఇప్పటి వరకు పలువురు అభ్యర్థులు పోటీపడ్డారని.. అయితే బైడెన్‌ తీరు మరింత భయంకరమని, ఆయన అసమర్థుడని ట్రంప్‌ ఆరోపించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నెలకు రూ.50వేలు పెన్షన్ రావాలంటే..?

ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒత్తిడితో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో బతుకు బండి సాఫీగా నడపడం పెద్ద సవాలే. ఓ వైపు కుటుంబ సమస్యలు.. మరోవైపు ఆర్థిక కష్టాలు అనునిత్యం వెంటాడుతుంటాయి. వాటికి ఎదురీది చివరకు ఉద్యోగ విరమణానంతర జీవితంలోనైనా హాయిగా గడపాలనుకుంటాం. అప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని ఆశిస్తాం. కానీ అందుకుతగ్గ ప్రణాళిక వేసుకోకపోతే మాత్రం ఆ చిక్కులు తప్పవు. అందుకే, చిన్నప్పటి నుంచే పొదుపు అలవర్చుకొనేలా కచ్చితమైన ప్రణాళికలు తప్పనిసరి. సరైనచోట మదుపు చేస్తేనే.. మలి వయసులో ప్రశాంతమైన ఆర్థిక జీవితాన్ని సాగించేందుకు వీలవుతుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దుర్గమ్మ వెండి సింహం ప్రతిమలు ఎక్కడ?

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం సింహం ప్రతిమలు మాయమైన ఘటన వెలుగు చూసింది. ఆలయ సిబ్బంది మాత్రం అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సుశాంత్‌ ఫామ్‌హౌస్‌.. సారా, రియా పార్టీ

యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసుకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్న ఎన్‌సీబీ ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తోపాటు డ్రగ్స్‌ను సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తోంది. సుశాంత్‌ సింగ్‌ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన హీరో లోనావాలా ఫామ్‌హౌస్‌పై ప్రస్తుతం ఎన్‌సీబీ నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా సదరు ఫామ్‌హౌస్‌ మేనేజర్‌ రాయిస్‌ ఓ ఇంటర్వ్యూలో సుశాంత్‌కు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రియా ఎవరో నాకు తెలియదు: తాప్సీ

10. IPL: ‘టాప్’ లేచిపోయే విజయాలు‌

క్రికెట్లో జయాపజయాలు మామూలే. కానీ ఎంత గొప్పగా గెలిచామన్నదే అత్యంత ముఖ్యం. నువ్వానేనా అన్నట్టు సాగే పోరులో గెలుపు ఎంత కిక్కిస్తుందో ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించినా అంతే మజా వస్తుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వంద పరుగుల తేడాతో గెలిచిన సందర్భాలు బాగానే ఉన్నాయి. సరికొత్త సీజన్‌ ఆరంభానికి ముందు వాటిలో టాప్‌-6 విజయాలేంటో రివైండ్‌ చేసుకుందామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని