close

తాజా వార్తలు

Published : 18/09/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 50,6344 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,043 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1016కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,802 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గస్తీమే సవాల్‌!

లద్దాఖ్‌ ప్రాంతంలోని భారత భూభాగంలో మన సైనికులు గస్తీ తిరగకుండా ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోజాలదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా భారీగా బలగాలను మోహరించిందని, తాము కూడా దీటుగా సైన్యాన్ని రంగంలోకి దించామని చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆయన రాజ్యసభలో గురువారం ఒక ప్రకటన చేశారు. సున్నితమైన ఈ అంశంపై చర్చ చేపట్టరాదని ప్రభుత్వం, విపక్షం అంగీకారానికి రావడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇంటి నుంచే ఓటు!

అభ్యర్థులు నామినేషన్ల దాఖలు మొదలు... ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వరకూ ఈసారి ఓటింగ్‌ ప్రక్రియ మొత్తం వీలైనంత వరకూ ఆన్‌లైన్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారధి అన్నారు. తద్వారా ఓటింగ్‌ శాతం పెంచడంతోపాటు ఎన్నికలకు సంబంధించిన ఇబ్బందులనూ పరిష్కరించవచ్చన్నారు. అందుకే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనేక ప్రయోగాలు చేయబోతున్నామని ఆయన చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వ్యవస్థల ప్రక్షాళనే లక్ష్యం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై వివిధ న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసుల విచారణలో పురోగతి కనిపించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పెండింగ్‌లో ఉండిపోతున్న క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేయడానికి వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. రాజకీయాల్లో నేరారోపణలున్న వారి సంఖ్య పెరిగిపోవటం, ఇప్పటికే విచారణ జరుగుతున్న కేసులను బలవంతులైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రజాప్రతినిధులు..అధికారానికి తాత్కాలిక ధర్మకర్తలు

5. త్వరలో రైల్వే ప్రయాణికులకూ యూజర్‌ ఛార్జీలు!

విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లే త్వరలో రైల్వే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేయనున్నారు. దేశంలో కొన్ని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తోంది. వీటిని వాడుకొనే ప్రయాణికుల నుంచి నామమాత్రంగా ఛార్జీలు వసూలు చేస్తామని రైల్వేబోర్డు ఛైర్మన్‌ వీకేయాదవ్‌ గురువారం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈఎస్‌ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి చెల్లింపు

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్‌ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి లభిస్తుంది. వారికి జీతంలో 50 శాతం సొమ్మును భృతిగా చెల్లిస్తారు. అటల్‌ బీమిత్‌ కల్యాణ్‌ యోజన కింద ఈ సహాయం లభిస్తుందని గురువారం కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు. స్వయంగాగానీ, ఆన్‌లైన్‌ద్వారాగానీ, పోస్టులోగానీ ఇందుకు సంబంధించిన దరఖాస్తు పంపించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇంటర్‌ సిలబస్‌ 30 శాతం తగ్గింపు

 ఇంటర్‌మీడియట్‌లో 30 శాతం పాఠ్య ప్రణాళిక తగ్గింపునకు మార్గం సుగమమైంది. తమ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోని సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. ఇక్కడా అదే పద్ధతి అమలు చేస్తారు. ఇక ఆర్ట్స్‌ గ్రూపులకు సంబంధించి నిపుణుల కమిటీలను నియమించినందున వాటి సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటారు. ప్రవేశాలకు అనుమతి ఇచ్చినందున ఇప్పటివరకు వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని 804 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇంట్లోనే కోలుకుంటున్నారు!

కొవిడ్‌ బారినపడుతున్నవారిలో దాదాపు 94 శాతంమంది ఇళ్లలో ఉండే మందులు వాడి కోలుకుంటున్నారు. 6 శాతంమందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతోంది. హైదరాబాద్‌ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ (హెచ్‌హెచ్‌ఎఫ్‌) సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, మెదక్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో 400 మంది, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,520 మంది కొవిడ్‌ రోగులపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హిట్టు మాట వినపడినట్లేనా!

జయపజయాలు ప్రతి రంగంలోనూ సాధారణమే అయినా.. చిత్ర సీమలో విజయానికున్న ప్రాధాన్యం వేరు. ఇక్కడ హిట్టు మాటే స్ఫూర్తి మంత్రంలా పని చేస్తుంటుంది. ఒక్క సినిమా విజయం ఎన్నో చిత్రాలకు కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంటుంది. అద్భుతమైన ప్రతిభావంతుల్ని, సరికొత్త కథల్ని వెండితెరకు కానుకగా అందిస్తుంటుంది. అందుకే ఈ రంగంలోని ప్రతిఒక్కరూ ‘హిట్టుదేవోభవ’ అంటూ నిద్రలోనూ కలవరిస్తుంటారు. బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటాలని పరితపిస్తుంటారు. ఈ తరుణంలోనే.. ఓటీటీ వేదికలు సినీ వినోదాలకు ప్రత్యామ్నాయాలుగా మారాయి. మరి ఈ ప్రత్యామ్నాయ వినోద మాధ్యమాలపై హిట్టు మాట వినిపించుకున్న చిత్రాలెన్ని.. పరాజయాల్ని మూట కట్టుకున్న సినిమాలెన్ని? తెలుసుకుందాం పదండి..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IPL: రాహుల్‌ మీదే పంజాబ్‌ ఆశలు

ఇద్దరో.. ముగ్గురో.. నలుగురో కాదు. ఆ జట్టుకు డజను మంది సారథ్యం వహించారు. ప్చ్‌..! ఐనా లాభం లేదు. 12 సీజన్లలో ఒక్కటంటే ఒక్కసారీ ట్రోఫీ అందించలేకపోయారు. 2014లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. రెండు రోజుల్లో 13వ ఎడిషన్‌ ఆరంభమవుతోంది. పనిలో పనిగా 13వ కెప్టెనూ వచ్చేశాడు. అతడిపైనే ఆశలన్నీ..! అతడిపైనే భారమంతా..! తమ కలలను నిజం చేస్తాడని భావిస్తున్న ఆ జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌. ఆ సారథి కేఎల్‌ రాహుల్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చెన్నై చమక్‌.. ఇంకోసారి!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.