close

తాజా వార్తలు

Published : 19/09/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. అన్నివైపులా బిగింపులు!

దేశభక్తిని ఉద్దీపిస్తూ, 1962నాటి వైఫల్యాన్ని జ్ఞప్తికి తెస్తూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)పై భారత సేనల పోరాట సన్నద్ధత గురించి పార్లమెంటులో చేసిన ప్రకటనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. లదాఖ్‌ పర్వతాల్లో గడ్డిపరక కూడా మొలవకపోయినా, ఆ ప్రాంతం భారత ప్రాదేశిక సమగ్రతకు అత్యంత కీలకమని రాజ్‌నాథ్‌ ఉద్ఘాటించారు. 1960లలో జవహర్‌లాల్‌ నెహ్రూ లదాఖ్‌లో గడ్డిపరకైనా మొలవదంటూ చేసిన ప్రకటనతో పోల్చి చూస్తే, రాజ్‌నాథ్‌ విస్పష్ట వ్యాఖ్య విలువేమిటో అర్థమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​

2. తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,69,169కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ  శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,025కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,151 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,37,500కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

90 నిమిషాల్లోనే కచ్చితమైన కొవిడ్‌ పరీక్ష

3. కొనలేరు.. వినలేరు!

రోనా తెచ్చిన కష్టాలెన్నో! ఒకవైపు ఉద్యోగాలు, ఉపాధికి గండి పడుతుండగా..  మరోవైపు పిల్లల చదువులకు ఎన్నో తిప్పలు! పేదలతోపాటు మధ్యతరగతి కుటుంబాలకూ ఇదో పెనుభారంగా పరిణమిస్తోంది. ఆన్‌లైన్‌ చదువుల కోసం పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు కొని ఇవ్వడం.. టీవీలు సమకూర్చుకోవడం.. ఇంటర్నెట్‌ వాడకం చాలామందికి ఇబ్బంది కరంగా మారిపోతోంది. సర్కారీ విద్యార్థులకు ప్రభుత్వం టీవీ పాఠాలు బోధిస్తున్నా, హోంవర్క్‌ చేయడానికి, సందేహాల నివృత్తికి ఫోన్‌పై ఆధారపడాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పెట్రో బాంబు

కరోనా ప్రభావంతో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి, ఆదాయం పడిపోయి, కష్టాల్లో ఉన్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. కొత్తగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూపాయి చొప్పున ‘రోడ్డు అభివృద్ధి పన్ను’ను విధించింది. దీంతో ప్రజలపై ఏడాదికి దాదాపుగా రూ.600 కోట్ల మేర భారం పడనుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రజలు అదనంగా చెల్లిస్తున్న సొమ్ము ఏడాదికి సుమారు రూ.1,800 కోట్లు అని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. నాలా మింగేసింది.. నాన్నా!

స్నేహితులతో ఆడుకుని ఇప్పుడే వస్తానంటూ సైకిల్‌పై సంతోషంగా వెళ్లిన చిన్నారి నిర్జీవంగా ఇల్లు చేరింది. అప్పటి వరకూ సందడి చేసిన బిడ్డ అకాల మరణం ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ బయటకు వెళ్లిన బాలిక సుమేధ కపూరియా(12)ను ఓపెన్‌ నాలా బలితీసుకుంది. వరదనీటి ఉద్ధృతికి పొంగిపొర్లుతున్న నాలాలో కొట్టుకుపోయి దాదాపు రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో విగతజీవిగా కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

* సుమేధ.. ఆశలు సమిధ!

6. ఈఎస్‌ఐ కుంభకోణంలో లంచంగా బెంజి కారు..!

ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితునిగా ఉన్న కార్తీక్‌ను కేసు నుంచి తప్పించేందుకు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన కుమారుడు ప్రయత్నం చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన విశాఖలోని తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ‘ఈఎస్‌ఐ కేసులో ఏ14 నిందితుడు తెలకపల్లి కార్తీక్‌. మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు అతను గతేడాది డిసెంబరులో బెంజికారును కానుకగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. బార్లపై 20% కొవిడ్‌ రుసుము

ఆంధ్రప్రదేశ్‌లోని బార్ల లైసెన్సులను 2021 జూన్‌ నెలాఖరు వరకూ కొనసాగించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ అంశంపై హైకోర్టులో విచారణలో ఉన్న రిట్‌ పిటిషన్‌పై వచ్చే తుది తీర్పునకు లోబడి ఈ కొనసాగింపు ఉంటుంది. ప్రభుత్వం తాజా ఆదేశాల నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలతో గత 101 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిఉన్న 840 బార్లు, మైక్రోబ్రూవరీలు, నక్షత్ర హోటళ్లలోని బార్లు శనివారం నుంచి తెరుచుకునే అవకాశం ఉంది. అలాగే ఆయా బార్లపై కొత్తగా కొవిడ్‌ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. కేంద్రం అప్పు రూ.101 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వం రుణాలు జూన్‌ చివరినాటికి రూ.101.3 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చినాటికి రూ.94.6 లక్షల కోట్ల అప్పు ఉండగా, మూడు నెలల వ్యవధిలోనే రూ.6.7 లక్షల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ రుణ నిర్వహణపై శుక్రవారం విడుదలైన త్రైమాసిక నివేదికలో ఈ విషయం వెల్లడయింది. ఈ మూడు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.3.46 లక్షల కోట్లకు సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసింది. వీటి సగటు మెచ్యూరిటీ కాలపరిమితి 14.61 సంవత్సరాలుగా నమోదయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. ఫీజుల నియంత్రణను కఠినంగా అమలు చేస్తున్నాం

 కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని, ట్యూషన్‌ ఫీజులను నెలవారీ వాయిదాల్లో మాత్రమే వసూలు చేయాలంటూ జారీ చేసిన జీవో 46 అమలుకు కట్టుబడి ఉన్నామంటూ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. జీవోను ఉల్లంఘించే పాఠశాలలపై ఫిర్యాదుకు కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించినట్లు పేర్కొంది. ఫిర్యాదులపై 24 గంటల్లో స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పామంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. IPL: ఆ కెప్టెన్.. ఆ జట్టు‌కు గెలుపే మణిహారం

క్రికెట్‌ విచిత్రమైన ఆట! బ్యాట్స్‌మెన్‌ బాదే ధనాధన్‌ సిక్సర్లు.. బౌలర్లు టపటపా పడగొట్టే వికెట్లు.. అబ్బురపరిచే క్యాచులు చూస్తుంటే ఎంతో మజా వస్తుంది. ఇష్టమైన క్రికెటర్‌ గణాంకాలూ అంతే ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఛేదనలో కోహ్లీ చేసిన శతకాల సంఖ్య.. బుమ్రా ఏడాదిలోనే తీసిన వికెట్ల లెక్క.. ఎంఎస్‌ ధోనీ విజయాల శాతం వంటి వివరాలు ముచ్చట గొలుపుతాయి. వారిపై అంచనాలు పెంచుతాయి. మరికొద్ది గంటల్లోనే ఐపీఎల్‌-2020 ఆరంభం అవుతోంది. మరి ఆయా జట్ల విజయాల శాతం, నాయకుల ప్రభావం ఏంటో తెలుసుకుందామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

* ఐపీఎలొచ్చేసిందిరో..


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.