close

తాజా వార్తలు

Updated : 20/09/2020 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. సాధిద్దాం X ఓడిద్దాం

వివాదాన్ని రేకెత్తించిన వ్యవసాయ బిల్లుల్ని ఆమోదింపజేసేలా చూడాలని అధికార పక్షం, ఎలాగైనా ఓడించాలని విపక్షం సర్వశక్తులూ ఒడ్డుతుండడంతో ఏం జరగనుందనే ఆసక్తి అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన బిల్లులు ఆదివారం రాజ్యసభ పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. నిజానికి ఎగువసభలో పూర్తిస్థాయి ఆధిక్యం అధికార కూటమికి ఇంకా రావాల్సి ఉంది. అయినా గతంలో కొన్ని కీలక బిల్లులకు విపక్షాల మద్దతును కూడగట్టడంలో ఎన్డీయే విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వ్యవసాయ బిల్లులపై రైతుల సమర శంఖం

2. అంతటా ఒకటే ఉత్పరివర్తనం

తెలంగాణ సహా భారత్‌లో 70 శాతంపైగా ఏ-2ఏ రకం కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఉందని సీసీఎంబీ పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లోకి వైరస్‌ ప్రవేశించిన మొదట్లో ఎక్కువగా ఐ/ఏ-3ఐ రకం ఉన్నప్పటికీ క్రమేణా ఇది తగ్గిందని, ఏ-2ఏ రకమే విస్తరించిందని అన్నారు. జి క్లాడ్‌, 20ఏ, బీ, సీ పేర్లతోనూ ఈ రకం వైరస్‌ను పిలుస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగానూ ఇదే రకం వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని చెప్పారు. ‘దేశ వ్యాప్తంగా 1,377 వైరస్‌ నమూనాల జన్యువులను విశ్లేషించాం. ఏ-2ఏ రకం వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్లలో డీ614జీ ఉత్పరివర్తనం (మ్యుటేషన్‌) కలిగి ఉందని గుర్తించాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 3 రాజధానులు నమ్మకద్రోహమే

అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితం కాదని.. ఇది ఆంధ్రులందరి సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని.. మూడు రాజధానులంటే నమ్మకద్రోహమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర విభజన అనుభవాన్ని చూస్తున్నామని.. మళ్లీ మూడు రాజధానులంటే రాష్ట్రాన్ని  మూడు ముక్కలుగా విభజించటానికి పునాది వేసినట్లే తప్ప మరోటి కాదని అన్నారు. అమరావతిపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన జనసేనాని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శాకాభారం

కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. జనం నిత్యం వినియోగించే రకాలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మార్కెటింగ్‌ శాఖే నిర్ధరించింది. కూరగాయల ధరలు మండిపోతున్న మాట వాస్తవమేనని ప్రభుత్వానికి ఆ శాఖ తాజాగా నివేదించింది. గతేడాది ఇదే నెలలో రైతుబజార్లలో ఉన్న ధరలను ప్రస్తుతమున్న వాటితో పోలుస్తూ విశ్లేషణ చేసింది. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలూ పెరిగినట్లు వివరించింది. అత్యధికంగా కిలో టమాటా ధర సుమారు ఏడింతలు పెరిగింది. ఉదాహరణకు 2019 సెప్టెంబరు 10న కిలో టమాటాల ధర హైదరాబాద్‌ రైతుబజార్లలో కేవలం రూ.6 ఉండగా.. ఈ నెల 19న రూ.41కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చక్కటి భావోద్వేగాల ‘యమలీల..ఆ తరువాత’

వెండితెరపై ఓ కథకి శుభం కార్డు పడింది.  పాతికేళ్ల తర్వాత ఆ కథ పునః ప్రారంభమైంది...అదే - ‘యమలీల  ...ఆ తరువాత’.  ఈ నెల 21(సోమవారం) నుంచి ‘ఈటీవీ’లో రాత్రి 8గంటలకు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ‘వేశా.. మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా.. నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా..’- ఇలా పాతికేళ్ల కిందట తల్లీకొడుకుల అనుబంధాన్ని ఒక అందమైన కథలో... గొప్పగా ఆవిష్కరించిన చిత్రం ‘యమలీల’. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘యమలీల ... ఆ తరువాత’ ధారావాహిక రూపొందింది. సినిమాలో తల్లీకొడుకులుగా నటించిన అలీ, మంజు భార్గవి ఇందులోనూ అదే పాత్రల్ని పోషించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సురేష్‌ దర్శకుడు. ఈ సందర్భంగా అలీ, మంజు భార్గవి ‘ఈనాడు సినిమా’తో   చెప్పిన విశేషాలివి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ముంబయి ఎవరి జాగీరు?

జాతీయ అవార్డు విజేత, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను బెదరగొట్టడానికి శివసేన మొరటు చేష్టలకు పాల్పడటాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారు. కంగన ఊళ్లో లేని సమయం చూసి ఆమె ఇంటిని కూలగొట్టడం ఎందరినో దిగ్భ్రాంతపరచింది. ప్రజాస్వామ్యం, న్యాయపాలనలను శివసేన ఇంతగా అపహాస్యం చేయడం అత్యంత గర్హనీయం. ముంబయి శివసేన సొత్తు కాదని, ఆ నగరంలో ప్రవేశించడానికి సేన నుంచి ఎవరూ వీసాలు పొందనక్కర్లేదని ఘాటుగా తేల్చిచెప్పాలి. ముంబయి భారతదేశమంతటికీ చెందుతుందని స్పష్టం చేయాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మీ ఇంటికే బ్యాంకింగ్ సేవలు

ఇంటి నుంచే మరిన్ని బ్యాంకింగ్‌ సేవలు పొందేందుకు ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు అవకాశం కల్పిస్తున్నాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో, బ్యాంకు శాఖలకు వచ్చి, వరుసలలో ఉండేందుకు భయాందోళన చెందుతున్న వారికి ఇవి సౌలభ్యంగా ఉండనున్నాయి. ఇందుకోసం ‘ఇంటివద్దే బ్యాంకింగ్‌ సేవలు పొందండి’ అంటూ పీఎస్‌బీలు తమ ఖాతాదార్లకు ఇటీవల సంక్షిప్త సందేశాలు పంపుతున్నాయి కూడా. ఈ సేవలు ఉచితం మాత్రం కాదు. ప్రత్యేకంగా నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి సేవకు రుసుము చెల్లించాల్సిందే. ఇవి ఎలా పొందవచ్చంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముకేశ్‌ అంబానీ ఏంచెప్పారంటే...

‘అంగ్రేజీ మీడియం’ సినిమా చూశారా? లండన్‌ వెళ్లి చదువుకోవాలనుకున్న కూతురు కోసం తండ్రి ఇర్ఫాన్‌ఖాన్‌ నానాతంటాలుపడతాడు... జ్యోతిదేశ్‌పాండే కూడా ఎంబీయే చదవడం కోసం ట్యూషన్లు చెప్పి పైసాపైసా కూడబెట్టింది..  ఈ రెండింటికీ సంబంధం ఏంటంటే... అంగ్రేజీ మీడియం సినిమా నిర్మాత జ్యోతినే! బాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాతగానే కాదు.. ప్రతిష్ఠాత్మక రిలయెన్స్‌ మీడియా హెడ్‌గానూ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారామె.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ట్రంప్‌నకు విషంతో కూడిన పార్శిల్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన ఓ పార్శిల్‌ను వైట్‌ హౌస్‌ చిరునామాతో పంపారు. దీన్ని తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన అధికారులు అక్కడే నిలిపివేశారు. ప్రాథమిక నిర్ధారణ పరీక్షల్లో అది రిసిన్‌ అనే విషపదార్థం అని తేలినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అనుమానిత కవర్‌ ఒకటి ట్రంప్‌ పేరిట వచ్చిందని.. దానిపై దర్యాప్తు కొనసాగుతుందని మాత్రం దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ(ఎఫ్‌బీఐ), సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీస్‌ కలిపి సంయుక్తంగా దీనిపై విచారణ జరుపుతున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నైదే చిందు

నిరుడు ఐపీఎల్‌ ఫైనల్లో ముంబయి చేతిలో కంగుతిన్న చెన్నై.. ఈ సీజన్‌ ఆరంభ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాకిస్తూ టోర్నీలో శుభారంభం చేసింది. శనివారం అబుదాబిలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్‌-13 తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. సౌరభ్‌ తివారి (42; 31 బంతుల్లో 3×4, 1×6) టాప్‌స్కోరర్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* శుభారంభం ఎవరిదో?


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.