close

తాజా వార్తలు

Published : 22/09/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఆస్తులమ్మి.. ఆసుపత్రికి!

కొవిడ్‌ ఆరోగ్యపరంగానే కాదు.. మనుషుల్ని ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. బతుకులు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. కరోనా బారినపడిన కుటుంబాల్లో కొందరు చికిత్స కోసం రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి చితికిపోతున్నారు. మనిషిని బతికించుకోవాలనే ఆశతో ఇల్లో, పొలమో అమ్మేసో.. తాకట్టు పెట్టో కార్పొరేట్‌ ఆసుపత్రులు అడిగినంతా చెల్లిస్తున్నారు. లక్షలు కుమ్మరించినా.. చివరకు అయినవారు దక్కక మానసికంగా కుమిలిపోతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అదిగో ఔషధ నగరి..

 తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కానున్న అతిపెద్ద ఔషధ తయారీ సమూహం.. హైదరాబాద్‌ ఔషధనగరికి దసరా నాడు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖలకు అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఔషధనగరికి సృజనాత్మక, ఆకర్షణీయ లోగో తయారుచేయించి, శంకుస్థాపన కంటే ముందే ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిపాదనలను ఆహ్వానించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,166 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,74,774కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ  మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,052కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,143 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,44,073 కి చేరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజధాని బిల్లులు ఆమోదం పొందినట్లే

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా శాసన మండలి సెలక్ట్‌ కమిటీ ముందు ఉన్నాయన్న వాదన సరికాదని ఏపీ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు హైకోర్టుకు వెల్లడించారు. మండలి నుంచి నిర్ణీత సమయంలో బిల్లులు తిరిగి వెళ్లకపోతే అధికరణ 197(2) ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని స్పష్టం చేశారు. ఈ బిల్లుల వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘనేమీ జరగలేదని చెప్పారు. ఈ రెండు బిల్లులను సవాలు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆయన కౌంటర్‌ వేేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జబ్బులకు విరుగుడు విషతుల్యాల నిర్మూలనే!

శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. జబ్బులను తనను తాను నయం చేసుకుంటుంది. ఆ మాటకొస్తే జబ్బుల బారినపడకుండా నిరంతరం కాపాడుకుంటూనే ఉంటుంది. కాకపోతే- దానికి కొంత సమయం ఇవ్వాలి. ఓ అవకాశం ఇవ్వాలి. మన సనాతన వైద్య పద్ధతులన్నింటి సారమిదే. ప్రకృతి చికిత్స కావొచ్చు, సంప్రదాయ చికిత్సలు కావొచ్చు, ఆయుర్వేదం కావొచ్చు, యోగా కావొచ్ఛు అన్నింటి ఉద్దేశం ఒకటే. భూమి, గాలి, అగ్ని, ఆకాశం, నీరు.. ఇలా పంచ భూతాల సమాహారమైన దేహాన్ని వీటి సాయంతోనే ప్రాణశక్తిని తిరిగి ఉత్తేజితం చేయటం. జబ్బులను మూలం నుంచి తొలగించటం. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో వెలసిన సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ సంకల్పమూ ఇదే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రక్షణ రంగంలో.. అతివకు అందలం

అడ్డుగోడలు తొలగిపోతున్నాయి. ఆకాశమే హద్దుగా అతివలు దూసుకుపోయేందుకు రంగం సిద్ధమయింది. కదనరంగంలోకి దూకి.. శత్రుదేశాలపై గర్జించడానికి మహిళా శక్తి సమాయత్తమవుతోంది. అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానం నడపడానికి ఓ మహిళా పైలట్‌ సిద్ధమైతే.. ఇద్దరు మహిళా అధికారులు నౌకా దళంలో బాధ్యతలు చేపట్టి నవ శకానికి తెరతీశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైల్వే జోన్ల తగ్గింపు!

దేశంలో రైల్వే జోన్లు, డివిజన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాటి పునర్విభజన, హేతుబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రైల్వే పరిపాలన వ్యవస్థలో సంస్కరణలు, భారీ రైల్వే ప్రాజెక్టుల కోసం వనరుల సమీకరణ, రైల్వే బోర్డు పునర్విభజన కోసం 2014లో బిబేక్‌ డెబ్రాయ్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు. 32 సిఫార్సులతో 2015లో ఆ కమిటీ నివేదిక సమర్పించిందన్నారు. వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామని, మరికొన్నింటిపై కసరత్తులు జరుపుతున్నామని వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొన్ని బ్యాంకుల్ని ప్రైవేటీకరించండి

ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రభుత్వానికి సూచించారు. ఒక మొండి బకాయిలను సమస్యలు పరిష్కరించేందుకు ఒక ‘మొండి బ్యాంకు’ను సైతం ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్యతో కలిసి ‘ఇండియన్‌ బ్యాంక్స్‌: ఎ టైమ్‌ టు రిఫామ్‌’ అనే చర్చాపత్రంలో రాజన్‌ పలు సూచనలు చేశారు. అవేంటంటే..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నీ నవ్వు వెన్నెల సముద్రం

వెన్నెలలా నవ్వే అమ్మాయి... ఎర్నని వన్నెలో మెరుస్తున్న గాజులను వయ్యారంగా చేతులకు వేసుకుంటుంటే! చూసే కళ్లలో ఆనందం ఉప్పెనై పొంగదా?...పొంగుతుందనే అంటోంది ‘ఉప్పెన’ చిత్ర బృందం... సోమవారం తమ కథానాయిక కృతిశెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్రంలో ఆమె కొత్త లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మార్చిలోనే పూర్తైయింది. లాక్‌డౌన్‌ కారణంగా విడుదల ఆగిపోయింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బెంగళూరు విజయారంభం

బెంగళూరు బోణీ కొట్టింది. ప్రతీసారీ అంచనాలను అందుకోలేకపోతున్నా ఎప్పట్లానే అభిమానుల భారీ మద్దతుతో బరిలోకి దిగిన కోహ్లీసేన గెలుపుతో ఐపీఎల్‌-13ను ఆరంభించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు నిరాశ. బెయిర్‌స్టో సూపర్‌ ఇన్నింగ్స్‌తో వార్నర్‌ బృందం విజయం దిశగా సాగినా.. చాహల్‌ స్పిన్‌ మాయాజాలానికి తలవంచింది. చక్కని అవకాశాన్ని చేజార్చుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ మెరిశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చెన్నైకి ఎదురుందా?


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.