close

తాజా వార్తలు

Updated : 29/09/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. కరోనా కాలం.. కర్షక విజయం

న్నో వ్యాపారాలు మూతపడ్డాయి.. ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధి కరవైంది.. వలస కార్మికులు రోడ్డుపాలయ్యారు.. కరోనా సృష్టించిన విలయంలో దాదాపు అన్ని రంగాలూ ప్రభావితమయ్యాయి.. అయితే, ఇంతటి సంక్షోభ సమయంలోనూ అన్నదాతలు ముందుకు ‘సాగు’తూనే ఉన్నారు. కొవిడ్‌ ప్రభావంతో ఎదురైన సమస్యల్ని అధిగమించి, వ్యయప్రయాసలకోర్చి రాష్ట్రంలో ఈ సారి రికార్డు స్థాయిలో పంటలు సాగుచేసి చూపించారు.  వ్యవసాయ పనుల్లో పరస్పర సహకారం, యంత్రాల వినియోగం, కుటుంబ సభ్యులంతా పనులు చేసుకోవడం వంటి  ప్రత్యామ్నాయ మార్గాలతో రైతన్నలు కరోనా సమయంలోనూ విజయవంతంగా ముందుకెళ్లడంతో సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.35 వరకు పెరగనున్న రైలు టికెట్‌ ధర!

అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుంచి టికెట్‌ ధరలపై రూ.10 నుంచి రూ.35 వరకు అదనంగా వసూలు చేసే దిశగా రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది! ఈ మేరకు ప్రతిపాదన సిద్ధమైందని, త్వరలోనే దాన్ని కేంద్ర మంత్రివర్గం ముందుకు పంపించనుందని సమాచారం. ప్రయాణికులు కొనుగోలు చేసే టికెట్‌ తరగతిని బట్టి ఈ వినియోగ రుసుమును విధించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏసీ ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణికులపై గరిష్ఠంగా రూ.35 వరకు అదనపు భారం పడే అవకాశముందని, వినియోగ రుసుము కనిష్ఠంగా రూ.10 ఉండొచ్చని తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నాకు, అత్తమామలకు ప్రాణహాని

తనకు, తన అత్తామామల కుటుంబానికి తండ్రి లక్ష్మారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని హేమంత్‌ భార్య అవంతి ఆరోపించారు. సోమవారం ఆమె హైకోర్టు న్యాయవాది కల్యాణ్‌ దిలీప్‌ సుంకరతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అత్తామామల ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రోజూ రెక్కీ నిర్వహిస్తున్నారన్నారు. గచ్చిబౌలిలో హేమంత్‌తో కలిసి ఉన్న ఇంటి కోసం ఆదివారం కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్లగా పలువురు తమ కారును అనుసరించారని ఆమె పేర్కొన్నారు. సోమవారం ఉదయం తన మరిది ఇంటి నుంచి బయటకు వెళ్లగా ఇద్దరు వ్యక్తులు అనుసరించారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరో గ్యాంగ్‌తోనూ ఒప్పందం!

4. గుండె భాష వింటున్నారా?

భాష ఏదైతేనేం భావం ప్రధానం. గుండె భాష అలాంటిదే. జబ్బుల గురించి ముందే గొంతెత్తుతుంది. ఛాతీ నొప్పి రూపంలోనే కాదు, రకరకాలుగా తన ఘోషను వెలిబుచ్చుతుంది. ముఖ్యంగా.. ఇతరత్రా వ్యాధులుగా బురిడీ కొట్టించే లక్షణాలపై ఏమాత్రం ఏమరుపాటు తగదని ముందే హెచ్చరిస్తుంది. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా ఓసారి గుండె మాట విందాం. గుండెజబ్బు అనగానే ఛాతీలో నొప్పి, చెమట్లు పట్టటం, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి కావటం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. అందరిలోనూ ఇలాంటి స్పష్టమైన, కచ్చితమైన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నా అధికారాలు ఏమిటో చూపిస్తా

పశ్చిమ బెంగాల్‌ పోలీసు రాజ్యంగా మారిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగంలోని 154వ అధికరణం కింద గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. సోమవారం వాట్సప్‌కాల్స్‌ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ పరమైన నిఘా పెట్టినందున ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంటూ ఈ నెల మొదటి వారంలో డీజీపీ వీరేంద్రకు గవర్నర్‌ లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దోమకు పొగబెడదాం!

దోమలు దండెత్తే కాలమిది. జోరుగా కురుస్తున్న వర్షాలతో భారీగా ఉత్పత్తయ్యే దోమలు జనావాసాలపై దాడి చేస్తున్నాయి. వీటివల్ల డెంగీ, మలేరియా, గన్యా తదితర జ్వరాల వ్యాప్తికి అవకాశముంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ రోగకారక కీటకాన్ని ఎదుర్కోవచ్ఛు దోమతెరల వినియోగం, ఇల్లు, పరిసరాల పరిశుభ్రతతోపాటు పలు రకాల పెరటి మొక్కల పెంపకం, నూనెల వినియోగంతో సహజ సిద్ధంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ.50,000 దిగువకు పసిడి

చుక్కలనంటేలా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమేణ దిగివస్తున్నాయి. నాణేలు, బిస్కెట్ల రూపంలో లభించే 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర సోమవారం ముంబయి విపణిలో రూ.50,000 దిగువకు వచ్చి, రూ49,757 వద్ద స్థిరపడింది. వెండి కిలో రూ.58,071 కి పరిమితమైంది. దిల్లీ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.50,449, వెండి కిలో రూ.59,274గా ఉంది. కోల్‌కతా విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ..50,310, కిలో వెండి ధర రూ.58,440గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రతి రూపాయిపై 800 వచ్చాయ్‌

8. వారసుడు కావాలని.... మామే మృగమయ్యాడు..!

మాది గుంటూరు. నేను ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2016లో వివాహం చేసుకున్నాం. మాకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి మగపిల్లాడిని కనలేదంటూ భర్త వేధించడం ప్రారంభించాడు. అతని ప్రవర్తనపై మామయ్యకు చెపితే.. మాకు వారసుడు కావాలి. నువ్వు నాతో ఉండు. నేను చూసుకుంటానన్నాడు. నీ కుమార్తె లాంటి దాన్ని అలా మాట్లాడటం పద్ధతి కాదంటే ఇవన్నీ మామూలే అన్నాడు. అప్పటి నుంచి లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కథానాయికలకు దక్కని జామీను

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానిల జామీను అర్జీని ఏసీఎంఎం న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. రాగిణి, సంజన ఇద్దరూ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీల్డ్‌ కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. ఈడీ అధికారుల విచారణనూ కొనసాగిస్తున్నారని, జామీను మంజూరు చేస్తే సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని సీసీబీ తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇషాన్‌.. 99 ఔట్‌ బాధ నీ ఒక్కడిదే కాదు

ఒక్క అడుగుతోనే మొదలయ్యే ప్రయాణం గమ్యం చేరుకుంటేనే ఆనందం. అదే ప్రయాణం చేరాల్సిన గమ్యానికి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోతే..? గుండె తరుక్కుపోతుంది. ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. చెప్పలేని బాధ మనసును పట్టి పీడిస్తుంది. 10ని 20.. 20ని 50.. 50ని 100గా మలిచేందుకే క్రికెటర్లు తాపత్రయపడతారు. మధ్యలోనే వెనుదిరిగితే ప్చ్‌..! అనుకొని మర్చిపోతారు. 99 వద్ద ఔటైతే ఉండే బాధ మాత్రం వర్ణనాతీతం. ప్రస్తుత లీగ్‌లోనూ ఆ మైలురాయికి పరుగు దూరంలో నిలిచిపోయిన సందర్భాలు కొందరికి ఎదురయ్యాయి. తాజాగా ముంబయి యువకుడు ఇషాన్‌ కిషన్‌ 99 బాధను అనుభవిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అటు ఇటు తిరిగి.. చివరికి ఆర్‌సీబీ చేతికి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.