close

తాజా వార్తలు

Updated : 17/10/2020 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. రానున్న కాలంలో రెట్టింపు వర్షాలు!

ప్రస్తుతం వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు.. వరదలు, ముంపు నుంచి బయట పడటానికి హైదరాబాద్‌ నగరంలో చేపట్టాల్సిన చర్యలపై బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బిట్స్‌)కి చెందిన పరిశోధకురాలు స్వాతి వేముల పలు అంశాలను ‘ఈనాడు’కు వివరించారు. బిట్స్‌లో పీహెచ్‌డీ చేసిన ఈమె ప్రొఫెసర్‌ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో పలు పరిశోధన పత్రాలను సమర్పించారు. 2020 నాటికి 28 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గత ఏడాది ప్రచురించిన పత్రంలో పేర్కొనడంతో పాటు 2100వ సంవత్సరం వరకు వర్షపాతాన్ని ఆమె అంచనా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇంటి నిండా బురద.. కళ్ల నిండా బాధ

2. జగన్‌కు 30 ఏళ్ల శిక్షపడే అవకాశం!

జగన్‌కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్లు దిల్లీ సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. అవినీతిపరుడు ముఖ్యమంత్రై న్యాయ వ్యవస్థపైనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ నేతలతో శుక్రవారం జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఉన్మాదులు స్వైర విహారం చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శక్తి తత్వం

శివశక్తుల సంయోగమే ఈ సృష్టికి మూలకారణం. శివుడి మూర్తి ఒక్కటేే. ఆ శివతత్వం విస్తారరూపమే శివా. శివ శక్తుల ఏకరూపమే పరాశక్తి. దాన్ని వేదాంతులు బ్రహ్మమంటారు. శక్తితో కలయిక లేకపోతే శివుడు క్రి¨యాశూన్యుడవుతాడని ఆధ్యాత్మిక భావన.  శక్తితో కలిసిఉన్నప్పుడే శివుడు (పరమాత్మ) సృష్టి చేయడానికి సమర్థుడవుతాడు. శక్తితో కలిసి లేకపోతే ఆయన కదలడానికి కూడా సమర్థుడు కాడు. అందువల్లనే హరిహర బ్రహ్మాదులంతా ఆ శక్తినే ఆరాధిస్తుంటారు. లోకంలో ఏదైనా కదలిక ఉందంటే దాని వెనక ఏదో ఒక శక్తి ఉందన్నది నిశ్చయం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణలో కొత్తగా 1,451 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1451 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 9మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,265కి చేరింది. రాష్ట్రంలో 22,774 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 18,905 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌-19 టీకా ‘అత్యవసర వినియోగానికి’ అనుమతి కోరనున్న ఫైజర్‌

5. అన్న పాలిట ఆపద్బాంధవి

లోకంలో ప్రతి ఒక్కరి పుట్టుక వెనుక ఏదో ఒక కారణం ఉంటుందంటారు! అందరి సంగతి ఎలా ఉన్నా.. ఆ పాప మాత్రం కచ్చితంగా కారణ జన్మురాలే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అన్న ప్రాణాలను నిలబెట్టడం కోసం జన్మించిన ఆపద్బాంధవి ఆ చిన్నారి. ఏడాది వయసు కూడా నిండకముందే సోదరుడి పాలిట సంజీవనిగా మారి, అతడికి పునర్జన్మను ప్రసాదించిన ఆ పాప పేరు కావ్య. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సహదేవ్‌ సింగ్‌ సోలంకి, అల్పా సోలంకి దంపతుల రెండో సంతానం అభిజిత్‌ (6). అతడు ప్రాణాంతక థలసీమియా వ్యాధి బారిన పడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. నీట్‌లో తెలంగాణ హవా

జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో ఇద్దరు విద్యార్థులు సంచలన ఫలితాలను నమోదు చేశారు. ఇద్దరికీ సమానంగా.. 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. వైద్య ప్రవేశ పరీక్షలో ఇలా నూటికి నూరు శాతం మార్కులు రావడం అరుదైన విషయం. ఒడిశా విద్యార్థి సోయబ్‌ అఫ్తాబ్‌, దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌ ఇలా చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో ఇద్దరికీ వరుసగా ప్రథమ, ద్వితీయ ర్యాంకులు లభించాయి. నీట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులూ ఉత్తమ ప్రతిభ కనబర్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

సిలబస్‌ తగ్గింపు వద్దు

7. 6 నెలల్లో పొడిగించకపోతే స్టే ఉత్తర్వులు రద్దయినట్లే..

 సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సహేతుకమైన కారణాలతో 6 నెలల్లోపు పొడిగిస్తే తప్ప.. కింది కోర్టులు, హైకోర్టులు ఇచ్చిన స్టే ఆర్డర్లన్నీ వాటంతట అవి (ఆటోమేటిక్‌గా) రద్దయిపోయినట్లేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారిమన్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ‘ఏసియన్‌ రీసర్ఫేసింగ్‌ ఆఫ్‌ రోడ్‌ ఏజెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ వర్సెస్‌ ‘సెంట్రల్‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ కేసులో ఈమేరకు ఆదేశాలిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. వరదలతో పాటే వ్యాధులు!

వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యఆరోగ్యశాఖ హెచ్చరించింది. వరదల ప్రభావంతో డయేరియా, జిగట విరేచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్‌, కామెర్లు, టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, గన్యా, మెదడువాపు వంటి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముందని పేర్కొంది. ఉప్పొంగిన వరదలకు తాగునీటి వనరులు కలుషితమయ్యే అవకాశాలున్నాయని, ప్రజలందరూ తాగునీటిని మరగబెట్టి, చల్లార్చి తాగాలని స్పష్టం చేసింది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తిరిగి ఇళ్లలోకి చేరడానికి ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. అలాంటి అబ్బాయిలతో జాగ్రత్త!

‘‘అమ్మాయిలూ.. అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదట్లో వారు మనతో చాలా సున్నితంగా ఉండి నమ్మిస్తారు. తర్వాత ముసుగులు తొలగిస్తారు. వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారు. ప్రతి ఒక అమ్మాయి ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రెండున్నరేళ్ల కిందట వరకూ నేనూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అతనిలో తీవ్రస్థాయిలో విలనిజం, సైకోయిజం గుర్తించాను. ఆ బంధానికి స్వస్తి పలికి నా కెరీర్‌పై దృష్టిసారించాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. ముంబయి పాంచ్‌ పటాకా

ముంబయి ఇండియన్స్‌కు తిరుగే లేదు. ఐపీఎల్‌-13లో దూకుడు కొనసాగించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. మరో ఘన విజయాన్నందుకుంది. మొదట ముంబయి బౌలర్ల ధాటికి తాళలేకపోయిన నైట్‌రైడర్స్‌ అతి కష్టంపై 148 పరుగులు చేస్తే.. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడటంతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసింది రోహిత్‌ సేన. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, నెట్‌రన్‌రేట్‌లోనూ మెరుగైన ముంబయి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతాకు 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో ఓటమి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.