close

తాజా వార్తలు

Updated : 18/10/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. వరుణ దేవా..వలదు వలదు

శనివారం సాయంత్రం.. అప్పటి వరకు కాస్తున్న ఎండ మబ్బుల చాటుకు వెళ్లింది. సమయం తీసుకుని.. అప్పుడొకటి అప్పుడొకటి చినుకులు పడటం మొదలైంది. నగరవాసులు ఈ పరిణామాలను గమనిస్తూ భయం భయంగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కాసేపటికే వర్షం నగరమంతా విస్తరించింది. సుమారు గంటన్నర వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదైంది. నాలుగు రోజుల కిందట జరిగిన పరిణామాలు గుర్తొచ్చి ప్రజల్లో వణుకు మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కారు తీయాలంటే.. జేసీబీ రావాల్సిందే!

2. యజమాని కోరుకున్న రోజే రిజిస్ట్రేషన్‌... మ్యుటేషన్‌ పూర్తి

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ధరణి పోర్టల్‌ ద్వారా మరింత సులువుకానున్నాయి. రాష్ట్రంలోని తహసీల్దారు కార్యాలయాల ద్వారా దసరా పండుగ రోజు నుంచి ఈ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. భూ యజమానులు, తహసీల్దారు కార్యాలయం చేపట్టాల్సిన విధి విధానాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక ఆ భూమిపై హక్కులు పొందేందుకు తహసీల్దారు కార్యాలయంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి

‘‘న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఆర్‌.లక్ష్మణన్‌ సంతాప సభలో శనివారం వీడియో ద్వారా ఆయన మాట్లాడారు. ‘‘ఒక వ్యక్తి మంచి జీవితం కొనసాగించాలంటే ఎన్నో గుణాలను అలవరచుకోవాలి. వినయం, ఓర్పు, దయ, కచ్చితమైన కార్యాచరణ, నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరచుకోగలిగే ఉత్సాహం వంటి లక్షణాలను కలిగి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యం... ప్రత్యేకించి న్యాయమూర్తులు తమ విలువలకు బలంగా కట్టుబడి ఉండాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 4. పండుగ రోజుల్లో జాగ్రత్త!

స్కూళ్లు, సినిమాలతోపాటు అన్ని వ్యాపారాలపై కరోనా ఆంక్షలు ఎత్తివేసి పునఃప్రారంభానికి అనుమతించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా వైరస్‌ కొత్త లక్షణాలు బయటపడుతూ, సమర్థ చికిత్స కోసం ప్రపంచమంతా ఇంకా అన్వేషిస్తున్న సమయంలో- ఇలా ఒత్తిడి పెరగడం చిక్కులు కొనితెస్తోంది. కరోనా కారణంగా వచ్చే కొవిడ్‌ వ్యాధిని తట్టుకోవడానికి ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగాల్సి ఉంది. ఈ వైరస్‌ దీర్ఘకాలంలో చూపే ప్రభావంపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా టీకా పంపిణీకి సమాయత్తమవుదాం

ప్రతి పౌరుడికి కొవిడ్‌-19 టీకా సత్వరం అందేలా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు, లేదా ఎన్నికలు వంటివి నిర్వహించాల్సి వచ్చినప్పుడు అన్ని స్థాయుల్లో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజం ఎలా స్పందిస్తాయో అలాంటి తరహాలోనే సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితులు, టీకా అందజేతకు సన్నద్ధతపై శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా పరీక్షలు, ఫలితాల్లో పారదర్శకత లేదు

6. ఎవరు గెలిస్తే ఏమవుతుందో!

వంబరు మూడో తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్‌ ప్రపంచం మీద దీర్ఘకాల ప్రభావం కనబరుస్తాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ గెలిచినట్లయితే అంతర్జాతీయ వైరుధ్యాలు తీవ్రతరమవుతాయని, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలిస్తే ప్రపంచ దేశాల మధ్య సరికొత్త సహకార శకం మొదలవుతుందని సూత్రీకరణలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష పదవి చేపడితే తన దురుసు పంథా మార్చుకోవచ్చుననేవారూ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చిన్న కార్లపై పెద్ద డిస్కౌంట్లు

ఇంటికి కొత్త కారు వస్తే ఆ ఆనందమే వేరు.. ఇక పండగ వేళలో అయితే.. చెప్పక్కర్లేదు.. కార్ల సంస్థలు ఇదే అదనుగా తమ విక్రయాలను పెంచు కునేందుకు ప్రయత్నిస్తుంటాయి. వాహన దారులను ఆకట్టుకునేందుకు పలు రకాల ఆఫర్లు, ప్రత్యేక రాయితీలతో ముందుకువస్తున్నాయి. పండగల బోనస్‌లు.. పాత కార్లను  మార్చుకుంటే.. ప్రత్యేక రాయితీలు... కార్పొరేట్‌ డిస్కౌంట్లు.. కొవిడ్‌-19 పోరాటయోధులకు ఆఫర్లలాంటివీ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చదువుల నాడి పట్టేశారు...ర్యాంకులు కొట్టేశారు!

ఐఏఎస్ అవ్వాలనుకున్నా, తర్వాత మనసు మార్చుకుని వైద్యసేవలందించాలనుకుంది... ఆకాంక్ష సింగ్‌. రోగులకు ప్రాణం పోసి... వాళ్లకళ్లలో వెలుగులు చూడటానికి మించిన సంతృప్తి మరొకటి లేదు కనుకనే వైద్యవృత్తిలోకి రావాలనుకుంది... స్నికిత. అమ్మానాన్నల స్ఫూర్తితో వైద్యవృత్తిలో అడుగుపెట్టాలనుకుంది చైతన్య సింధు... నీట్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకుల్లో నిలిచి తమ కలలని సాకారం చేసుకోవాలనుకుంటున్నారు వీరంతా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బయటి పేలుళ్లా.. లోపలి లోపాలా?

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం చేసిన పేలుళ్ల వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు నష్టం వాటిల్లిందా? లేక పంపుహౌస్‌లోనే పంపుసీల్స్‌, రిటర్న్‌ వాల్స్‌ దెబ్బతినడం వల్ల నీట మునిగిందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి పంపుహౌస్‌ను తొలుత నిర్ణయించినట్లుగా కాకుండా మార్చి చేపట్టడం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌస్‌కు 300 మీటర్ల దూరంలోనే పేలుళ్లు చేపట్టాల్సి ఉంటుందని, దీంతో పంపుహౌస్‌కు నష్టం జరిగే అవకాశం ఉందని 2016లోనే నీటిపారుదల శాఖ నియమించిన నిపుణుల కమిటీ నివేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అయ్యో చెన్నై

పాపం చెన్నై సూపర్‌కింగ్స్‌! శనివారం రాత్రి ఆ జట్టు ఓడిన తీరుకు జాలి పడకుండా ఉండలేం. చివరి ఓవర్లో 17 పరుగులు కావాలి. అలసిన ధావన్‌ షాట్లు ఆడలేకపోతున్నాడు. అక్షర్‌ పటేల్‌ అప్పుడే క్రీజులోకొచ్చాడు. ఇలాంటి స్థితిలో బౌలింగ్‌ చేయడంలో ఎంతో అనుభవమున్న బ్రావో వచ్చి చెన్నైని గెలిపించేస్తాడని అంతా అనుకున్నారు. కానీ బంతి జడేజా చేతికిచ్చాడు ధోని. చివరి ఓవర్లో స్పిన్‌ వరంలా కలిసి రావడంతో దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపించి దిల్లీని గెలిపించాడు అక్షర్‌. బ్రావో అస్వస్థతతో చివర్లో మైదానాన్ని వీడటం చెన్నై కొంపముంచింది. టీ20ల్లో సెంచరీనే అరుదంటే.. ధావన్‌ ఛేదనలో, ఒత్తిడి మధ్య 100 కొట్టి ఈ మ్యాచ్‌ హీరోగా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏబీ మెరుపు దాడి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.