close

తాజా వార్తలు

Published : 20/10/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఇప్పుడు ఈ వానలేంది?

వర్షాకాలం ముగిశాక, అక్టోబరులో ఈ కుండపోత వర్షాలేంటనే ప్రశ్న అందరి మదినీ తొలుస్తోంది. దీనిపై వాతావరణ కేంద్రాలు, శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తున్నారు. గత మార్చి 22 నుంచి జులై వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో కాలుష్యం తగ్గడం- దీనివల్ల గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ పెరగడం, వరుస అల్పపీడనాలతో నైరుతి రుతుపవాల నిష్క్రమణలో జాప్యం, షీర్‌జోన్లు ఇవన్నీ ప్రస్తుత అధిక వర్షాలకు కారణమని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నీరింకని కళ్లు

2. సీఎం క్రైస్తవుడు అనేందుకు ఆధారాలేవి?

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌ అనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఆధారాలు సమర్పించకుండా సీఎం హిందువు కాదు క్రైస్తవుడని కోర్టుకు ఎలా చెబుతారని వ్యాఖ్యానించింది. వివరాలు లేకుండా వ్యాజ్య విచారణలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అదనపు వివరాలు సమర్పించేందుకు వీలుగా విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. వ్యాజ్యంలో గవర్నర్‌ను ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యర్థన కోరనప్పుడు ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. ఆయన్ను జాబితా నుంచి తొలగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. న్యాయవ్యవస్థపై యుద్ధమా?

న్యాయవ్యవస్థను భయపెట్టి అనుచిత ప్రయోజనాలు పొందాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఈ నెల 6న చేసిన ఫిర్యాదును తిరస్కరించాలని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఆంధ్రప్రదేశ్‌ యూనిట్‌) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్‌ సీజేకు సోమవారం లేఖ రాశారు. 31 కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్‌పై బయట తిరుగుతున్న వ్యక్తి అదే వ్యవస్థపై యుద్ధం ప్రకటించడం దారుణమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చెలిమికి కొత్త చివుళ్లు!

‘ముమ్మాటికీ తైవాన్‌ మా దేశంలో అంతర్భాగమే. సంపూర్ణ విలీనానికి తైవాన్‌ అంగీకరించని పక్షంలో దానిపై సైనికదాడికీ వెనకాడం’ అంటూ ఈ ఏడాది మొదట్లో హుంకరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తాజాగా అదే వాదనను మరోమారు పునరుద్ఘాటించారు. యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని సేనలకు పిలుపునిచ్చిన జిన్‌పింగ్‌ తైవాన్‌ సరిహద్దుల్లో అత్యాధునిక క్షిపణులు మోహరిస్తున్నారు. చైనా దూకుడు పెరుగుతున్న ఈ తరుణంలో- తైవాన్‌ విషయంలో భారత వైఖరి ఎలా ఉండాలన్న దానిపై చర్చ ఊపందుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పుట్టగొడుగులతో కరోనాకు చెక్‌

కరోనా వైరస్‌ని మట్టుబెట్టే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఔషధాలు, టీకాల తయారీలో ఒక్కో ప్రయోగం ఒక్కో ఫలితాన్నిస్తున్న వేళ.. భారత్‌లో తొలిసారిగా ఓ యాంటీ వైరల్‌ ఔషధ ఆహారంపై ప్రయోగం సఫలమైంది. పుట్టగొడుగుల నుంచి తయారుచేసిన ఈ పూరకాహార(ఫుడ్‌ సప్లిమెంట్‌) తయారీకి హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) వేదికైంది. పుట్టగొడుగుల్లో  యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలోని బీటా గ్లూకాన్స్‌ యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు కలిగి ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రూ.45లక్షలు ఇస్తే మీ బాబును వదులుతా

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం కృష్ణ కాలనీలో నివాసముండే కుసుమ రంజిత్‌ పెద్దకుమారుడు దీక్షిత్‌రెడ్డి(9)ని ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి అపహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆడుకోవడానికి వెళ్లిన కుమారుడు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి దీక్షిత్‌ను తీసుకెళ్లాడని అతడితో ఆడుకున్న మిత్రుడు భువనచంద్ర చెప్పాడు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి బాలుడి తల్లి వసంత ఫోన్‌కు రాత్రి 9.45కి ఇంటర్నెట్‌ కాల్‌ చేసి రూ.45 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నాన్న ప్రశ్నకు సమాధానమే జియో

మన దేశాన్ని ఆత్మనిర్భర్‌ లేదా స్వావలంబన భారత్‌గా మార్చడానికి తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అభిప్రాయపడ్డారు. ‘సాంకేతిక రంగంలో ఇటీవల అంకురాలు ఎలా పుట్టుకొస్తున్నాయో.. ఇప్పుడు చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఆ స్థాయిలో మద్దతు దక్కాల్సిన అవసరం ఉంది. అందుకే క్లిక్‌ల (కంప్యూటర్ల కీ బోర్డులపై క్లిక్‌లు) కంటే బ్రిక్‌లపై (ఇటుకలు) దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంద’ని చమత్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కోయకుండానే కన్నీళ్లు

ఉల్లి ధరలు వినియోగదారుల కంటనీరు తెప్పిస్తున్నాయి. జులై మొదట్లో కిలో రూ.15 చొప్పున ఉన్న ధర మూడు నెలల్లో.. మూడున్నర రెట్లు పెరిగింది. రాష్ట్రంలో సోమవారం సగటు ధర కిలో రూ.69(నాణ్యమైన రకం) వరకు చేరింది. కాకినాడలో గరిష్ఠంగా కిలో రూ.90 పలుకుతోంది. మార్కాపురంలో అత్యల్పంగా రూ.46 చొప్పున ఉంది. పలు ప్రాంతాల్లో రెండో శ్రేణి ఉల్లి ధర కూడా కిలో రూ.56 చొప్పున విక్రయిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో పంట దెబ్బతినడం, ఉన్న కొద్దిపాటి పంట సైతం కుళ్లిపోవడంతో ఉల్లి నిల్వలు తగ్గిపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఊరి కోసం...నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది!

పైసా ఖర్చు లేకుండా  అమెరికా వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు కదా! కానీ 17 ఏళ్ల జయలక్ష్మి మాత్రం తనకొచ్చిన అవకాశాన్ని కాదనుకుని ఆ డబ్బుని తమ గ్రామ సమస్యల్ని తీర్చడానికే వినియోగించింది. తమిళనాడులోని ఆదనకోట్టై గ్రామానికి చెందిన జయలక్ష్మి చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత తల్లి అళగువల్లి మతి స్థిమితం కోల్పోయింది. తల్లితోపాటు తమ్ముడి బాధ్యతా తీసుకుని తొమ్మిదో ఏట నుంచే కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది జయలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే సెలవు రోజుల్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నై ఇంటికే!

చెన్నై ఇక ఇంటికే..! ఐపీఎల్‌ ఆడిన ప్రతీసారి ప్లేఆఫ్స్‌/సెమీస్‌ చేరిన ఆ జట్టు.. ఈసారి కనీసం రేసులో కూడా లేనట్లే. లీగ్‌ దశలో ఇంకో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సివున్న చెన్నై మరో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సోమవారం రాజస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.  చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేసిన ఆ జట్టు టోర్నీలో ఏడో పరాజయాన్ని చవిచూసింది.  ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో రాజస్థాన్‌ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అదిరిపోలా..


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.