close

తాజా వార్తలు

Published : 21/10/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఉరుముతున్నాయ్‌!

చెరువంటే ఊరికి కల్పతరువు. ఎంతో మందికి బతుకుదెరువు. చెరువు నిండితే మనసు పులకరిస్తుంది. భవితకు ఢోకాలేదని భరోసా ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ మహానగరంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. చెరువు నిండుతోందంటే భయం ఆవరిస్తోంది. ఎప్పుడు ఏ చెరువు కట్టతెగుతుందో..ఏ క్షణంలో వరద నీరు కాలనీలను ముంచేస్తుందో తెలియని స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 800 కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భాగ్యనగరం.. కన్నీటి సాగరం!

2. తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు

 తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 41,475 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,579 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,26,124కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,287కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,811 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అగ్ని శేషం... శత్రు శేషం... రోగ శేషం మంచిది కాదు

కరోనా టీకా అభివృద్ధికి మన శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. పరిస్థితులు ఆశాజనకంగా   కనిపిస్తున్నాయి. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే సాధ్యమైనంత వేగంగా ప్రతి ఒక్కరికీ అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. కఠిన సమయాన్ని అధిగమించి ముందుకెళ్తున్నాం. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం మన వేగాన్ని తగ్గిస్తుంది. మాస్క్‌, రెండు గజాల దూరం, చేతుల పరిశుభ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ  మరిచిపోవద్దు. అందరినీ ముకుళిత   హస్తాలతో ప్రార్థిస్తున్నా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భగ్గుమన్న ఉల్లి

వర్షాలు, వరదలతో ఉల్లిగడ్డ ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. పంట దెబ్బతిని రైతులు నష్టాల్లో చిక్కుకోగా, ధరాఘాతంతో సామాన్యులు అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు ఉల్లిగడ్డ సరఫరా ఆగిపోవడంతో దళారులు, చిరువ్యాపారులు ధరలు పెంచేశారు. బయట చిల్లర మార్కెట్లలో రూ.100 వరకూ చెబుతున్నారు. దక్షిణాదిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో మార్కెట్‌కు పంట రావడం లేదని హైదరాబాద్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సత్యలింగం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఉల్లిగడ్డ పంట క్షేత్రాలన్నీ మునిగిపోవడంతో ఎక్కువ పంట కుళ్లిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైలు ప్రయాణం.. మరింత భారం

సామాన్య ప్రయాణికులకు రైలు ప్రయాణం భారంగా మారనుంది. అతి చవక ఛార్జీలతో ప్రయాణాన్ని అందించడంతో పాటు దాదాపు ప్రతి స్టేషన్‌లో ఆగే ప్యాసింజర్‌ రైళ్ల సేవలు గ్రామీణ ప్రాంతాలకు దూరం కానున్నాయి. దేశవ్యాప్తంగా 362 ప్యాసింజర్‌, డెము, మెము రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తూ రైల్వేబోర్డు మంగళవారం పచ్చజెండా ఊపింది. కరోనా కష్టకాలంలో రైల్వేశాఖ గప్‌చుప్‌గా ఈ నిర్ణయం తీసుకుంది.  
దేశవ్యాప్తంగా 17 జోన్ల పరిధిలో 362 ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారిస్తే.. అత్యధికంగా 47 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నుంచే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పండగలకు ‘రద్దీ’ రైళ్లే!

6. జనవరి నాటికి 52 కోట్ల సిరంజీలు సిద్ధం

‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. మరికొద్ది నెలల్లో రానున్న ఈ వ్యాక్సిన్‌ కోసం యునిసెఫ్‌ అప్పుడే సన్నాహక చర్యలు మొదలుపెట్టింది. అందరికీ సురక్షితమైన వ్యాక్సినేషన్‌ అందేలా అవసరమైన సిరంజీలు, పరికరాలు కొని గోదాముల్లో భద్రపరుస్తున్నాం’ అని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు. సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా 52 కోట్ల సిరంజీలు, వందకోట్ల నీడిల్స్‌ 2021 నాటికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ ప్రయోగాలు విజయవంతమై రోగులకు వాడేందుకు అనుమతి లభించగానే ప్రపంచవ్యాప్తంగా సిరంజీల అవసరం పెరుగుతుందని యునిసెఫ్‌ అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ బియ్యం పండిస్తే.. పెట్టుబడి ఇస్తామంటున్నారు!

కాలాబట్టి, నవారా, రత్నసాలి, కులాకార్‌... ‘ఇవన్నీ ఏంటి?’ అనుకుంటున్నారా... దేశీ వరి వంగడాలు. మీకే కాదు మన రైతులకీ వీటి గురించి పెద్దగా తెలీదు. హరిత విప్లవం పేరుతో హైబ్రిడ్‌ రకాల్ని సాగుచేస్తూ... ఔషధ గుణాలుండే ఈ వంగడాలని ఎప్పుడో మర్చిపోయారు మనవాళ్లు. తమ కుటుంబంలో ఓ క్యాన్సర్‌ మరణం జక్కుల రేణుకని వీటి గురించి పరిశోధించేలా చేసింది. ఆమె ప్రయత్నం అక్కడితో ఆగిపోలేదు...వాటి సాగు దిశగా వెళ్లి ‘దేశీ వంగడాల విప్లవం’గా మారుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రకృతికి ‘సూక్ష్మ’ సాయం!

కంటికి కనిపించకపోవచ్చు కానీ సూక్ష్మక్రిములు చాలా తెలివైనవి. మహా మొండి ఘటాలు కూడా. ప్రతికూల పరిస్థితులనైనా అనువుగా మలిచేసుకుంటాయి. ప్లాస్టిక్‌ను ‘తినే’ బ్యాక్టీరియా ఇలాంటిదే. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పూర్తిగా కాపాడలేకపోయినా కాలుష్య నివారణకివి కొత్త దారులు చూపుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను మరింత త్వరగా విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌ల ఆవిష్కరణ ఇలాంటి ప్రయత్నమే. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనా బలగాలను ఎప్పుడు తరిమికొడతారు?

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. చైనా బలగాలను భారత భూభాగం నుంచి ఎప్పుడు తరిమికొడతారో మోదీ ప్రభుత్వం చెప్పాలని తాజాగా ఆయన డిమాండ్‌ చేశారు. వయనాడ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘విదేశీ శక్తులు సొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పటికీ నోరు మెదపని నాయకత్వం ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. భారత భూభాగం నుంచి చైనా దళాలను ఎప్పుడు తరిమికొట్టనున్నారో మోదీ చెప్పాలి’’ అని రాహుల్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చైనా కుబేరుల సంపద పెరిగింది

10. పంజాబ్‌ రేసులోనే..

భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ శిఖర్‌ ధావన్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఐపీఎల్‌లో వరుసగా రెండో సెంచరీ బాదేశాడు. పంజాబ్‌ బౌలర్లెవ్వరూ అతడిని అడ్డుకోలేకపోయారు. కానీ దిల్లీ జట్టులో ఆడింది ఆ ఒక్కడే. అతను సెంచరీ కొడితే.. ఇంకో బ్యాట్స్‌మన్‌ ఎవ్వరూ 20 పరుగులైనా చేయలేదు. ఫలితం.. ప్రత్యర్థి ముందు నిలిచింది 165 పరుగుల లక్ష్యమే. అక్కడా బ్యాట్స్‌మెన్‌ తడబడినా.. నికోలస్‌ పూరన్‌, క్రిస్‌ గేల్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో తక్కువ సమయంలో ఎక్కువ నష్టం చేసేశారు. దీంతో దిల్లీ బౌలర్లు ఎంతగా పోరాడినా.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి 7 మ్యాచ్‌ల్లో ఆరు ఓడి ప్లేఆఫ్‌ రేసులోనే లేనట్లు కనిపించిన పంజాబ్‌.. హ్యాట్రిక్‌ విజయంతో పోటీలోకి రావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.