టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM
close

తాజా వార్తలు

Updated : 25/10/2020 09:04 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. నన్ను.. మీరు పిలిపిస్తారా?

ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అది హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన హోదా కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవి. అలాంటి పదవిలో ఉన్న ఆయనకు.. సర్వీసులో ఆయన కంటే చాలా జూనియర్‌, ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధికారి కార్యాలయం నుంచి శనివారం ఒక వర్తమానం వెళ్లింది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికలు, శాసనమండలి ఉప ఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సీఎం క్యాంపు కార్యాలయం మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తున్నారని, దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హాజరవ్వాలన్నది దాని సారాంశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పసిగట్టాలి... చక్కదిద్దాలి

బాల్యమంటే అమాయకత్వం... పిల్లల మనసులు స్వచ్ఛం... ఎదిగేకొద్దీ పరిసరాల ప్రభావం వారిలో మార్పు తెస్తుంది. కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచీ విపరీత ప్రవర్తనకు అలవాటుపడతారు. చిన్నచిన్న కోరికలు తీర్చుకోవడానికి తల్లితండ్రులపై అలగడం, కోపం ప్రదర్శించడం వంటివి క్రమేణా ముదిరితే తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంటాయి. పసివయసులోనే వారి విపరీత ప్రవర్తనను సరిదిద్దకుంటే దుష్పరిణామాలు ఎదురవుతాయని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విజయ విలాసిని

సృష్టి అంతా ఆవరించి ఉన్న పరమ చైతన్యాన్ని, ప్రకృష్టమైన శక్తిని జగన్మాతగా ఆర్ష ధర్మం దర్శిస్తోంది. సకల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి పలు రీతుల వ్యక్తమవుతోంది. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులే జగత్తును ముందుకు నడిపిస్తున్నాయి. ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించాలనే సంకల్పం- ఇచ్ఛ! ఆ వ్యవహారానికి నిర్మాణాత్మక ప్రణాళిక రూపకల్పన- జ్ఞానం! సంకల్పాన్ని, ప్రణాళికను సమ్మిళితం చేయడం క్రియ! ఈ మూడింటి సర్వ సమగ్ర రూపమే మహాశక్తి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సరిహద్దులకు రండి

తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికులు ఆంధ్రా సరిహద్దుల వరకు చేరుకుంటే.. వారిని ఏపీలో గమ్యస్థానాలకు చేరుస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సర్వీసులపై మంగళవారం తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకుంటామని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పేందుకు చాలా ప్రయత్నం చేశామన్నారు. టీఎస్‌ఆర్టీసీకి మూడు రోజులు సెలవులు రావడం వల్ల ఒప్పందం 27వ తేదీన చేసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రుణగ్రహీతలకు దసరా బహుమతి

పండగల సీజన్‌లో రుణ గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ప్రకటించిన మారటోరియం విధానానికి లోబడి రూ.2కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని రద్దు చేసింది. ఫిబ్రవరి 29 నాటికి ఉన్న రుణాలకు దీనిని వర్తింపజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా రుణ గ్రహీతలకు రూ.6,500 కోట్ల మేర ప్రయోజనం కలుగనుందని అంచనా. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న ఎనిమిది రకాల రుణాలకు ఇది వర్తిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ ఎత్తివేత!

ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఉన్న 25% వెయిటేజీని ఎత్తివేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ఇంటర్‌ బోర్డుల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ, సార్వత్రిక విద్యాపీఠం, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ తదితర వాటిల్లో ఇంటర్‌ లేదా అందుకు సమానమైన విద్యార్హతతో ఉత్తీర్ణులైన వారు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా ఓటరు ఎటువైపు?

మెరికా ప్రజాస్వామ్యం- ముఖ్యంగా ఆ దేశ ఎన్నికల ప్రక్రియ చాలా సంక్లిష్ట దశలో ఉన్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ గద్దెనెక్కక ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల మధ్య ముఖ్యమైన విధానాలపై అద్భుతమైన, అర్థవంతమైన చర్చలు జరిగేవి. న్యాయంగా, నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేవి. ఎన్నికల్లో జయాపజయాలు తేలిన తరవాత అధికారం శాంతియుతంగా చేతులు మారేది. అందుకే అమెరికా ఇతర దేశాలకు ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛాయుత ఎన్నికల గురించి ఉపన్యాసాలు దంచగలిగేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పరువు నష్టం దావా గోవిందా!

ఇద్దరిపై తితిదే అధికారులు రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేశారు. దాని కోసం ముందస్తుగా రూ. 2 కోట్ల ధరావతును కూడా న్యాయస్థానంలో చెల్లించారు. అది ఇంకా కోర్టులో తేలకముందే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. దావా వేసినప్పటి ఈవోనే ఆ తర్వాతా కొనసాగారు. కానీ, దేవస్థానం పరువుకు నష్టం కలగలేదనుకున్నారో ఏమో.. దావా ఉపసంహరించుకుంటామని చెప్పారు. అందుకోసం తాము ముందుగా చెల్లించిన రూ. 2కోట్ల ధరావతును వదులుకోడానికీ సిద్ధపడ్డారు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎంతైనా అప్పటి సరదాలే వేరు

‘నన్ను దోచుకుందువటే’ అంటూ నభా నటేష్‌ తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ పేరుకు తగ్గట్టుగానే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుంది ఈ కన్నడ కస్తూరి. దర్శకుడు పూరి ఈమెని ఇస్మార్ట్‌ హీరోయిన్‌గా మార్చేశారు. ఇక కెరీర్‌కి మరింత వేగం వచ్చేసింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నభా నటేష్‌ ‘ఈనాడు సినిమా’తో దసరా ముచ్చట్లని పంచుకుంది. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రైజర్స్‌ ఢమాల్‌ 

లక్ష్యం 127 మాత్రమే. ఐపీఎల్‌లో ఈ మధ్య ఎక్కువగా రెండోసారి బ్యాటింగ్‌ చేస్తున్న జట్లే గెలుస్తున్న నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కూడా పెద్ద కష్టం లేకుండానే గెలిచేస్తుందని, నెట్‌రన్‌రేట్‌ను కూడా పెంచుకుంటుందని అనుకున్నారు అభిమానులు. పైగా జట్టుకు మెరుపు ఆరంభం లభించింది. మధ్యలో కొంచెం తడబడ్డా మళ్లీ కుదురుకుని విజయం దిశగా సాగింది.   7 వికెట్లు చేతిలో ఉండగా 4 ఓవర్లలో 27 పరుగులు చేస్తే చాలు. కానీ ఇలాంటి స్థితి నుంచి కుప్పకూలిపోయింది సన్‌రైజర్స్‌. 3.5 ఓవర్లలో ఏడు వికెట్లూ చేజార్చుకుని 12 పరుగుల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకున్న హైదరాబాద్‌.. ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌ వరుసగా నాలుగో విజయంతో ప్లేఆఫ్‌ రేసులో మరింత ముందంజ వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వారెవ్వా వరుణ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని