close

తాజా వార్తలు

Updated : 26/10/2020 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8గంటల వరకు 14,729 శాంపిల్స్‌ పరీక్షించగా.. 582 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,31,834కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,311కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఆదివారం 1,432 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,11,912కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సర్వదర్శన టోకెన్ల జారీ పునఃప్రారంభం

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లను తితిదే పునఃప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనం కల్పించనున్నారు. రోజుకు 3 వేల టోకెన్లను జారీ చేయాలని తితిదే నిర్ణయించింది. సర్వదర్శనం టికెట్ల కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డబ్బులున్నా ఆకలితో చనిపోయిన శాస్త్రవేత్త

ఆయన పేరుపైనే థియరట్రికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో విశేష కృషి చేసిన వారికి ఏటా గాడెల్‌ ప్రైజ్‌ ఇస్తున్నారు. 70 ఏళ్లు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉన్న కుర్ట్‌ కడుపు మాడ్చుకొని కన్నుమూశాడు. తినడానికి డబ్బులు లేక కాదండోయ్‌.. వడ్డించే వారిపై నమ్మకం లేక. కుర్ట్‌ గాడెల్‌.. ఓ గణిత శాస్త్రవేత్త.. గొప్ప తత్వవేత్త కూడా. చాలా మంది ఆయన్ను అరిస్టాటిల్‌తో పోల్చారు. 20వ శతాబ్దంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆయన ఆలోచనలు, విశ్లేషణలు ఉపయోగపడ్డాయి. ఆస్ట్రియా-హంగేరీకి చెందిన కుర్ట్‌ 1906 ఏప్రిల్‌ 28న జన్మించారు. గణితంలో మాస్టర్‌ డిగ్రీ సంపాదించిన ఆయన అమెరికాలో వివిధ యూనిర్సిటీల్లో పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘హైపర్‌’ ఆదికి ఆ టైటిల్‌ ఎవరు పెట్టారంటే!

తనదైన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో ‘జబర్దస్త్‌’ వేదికగా నవ్వులు పంచి ఎంతో క్రేజ్‌ సొంత చేసుకున్న నటుడు ‘హైపర్‌’ ఆది. ఇక వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వర్షిణి. వీరిద్దరూ కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ‘హైపర్‌’ అనే టైటిల్‌ ఎవరు ఇచ్చారో ఈ సందర్భంగా ఆది వెల్లడించారు. దీంతో వర్షిణి నవ్వాపుకోలేకపోయారు. ఇక పెళ్లి గురించి వర్షిణిని ప్రశ్నించగా, తాను ఇలాగే హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గొప్పోళ్లయినా.. ఎదురు దెబ్బలు తప్పలేదు! 

ఒక సంస్థ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపించడం అంత సులువు కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినియోగదారులు మెచ్చే ఉత్పత్తులు తయారు చేస్తూ, మెచ్చే సేవలు అందిస్తూ వారికి చేరువైతేనే సంస్థలకు గుర్తింపు లభిస్తుంది. అలా బిల్‌గేట్స్‌, జెఫ్‌ బెజోస్‌, స్టీవ్‌ జాబ్స్‌ వంటి అనేక మంది తమ సంస్థలను దిగ్గజ సంస్థలుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా, సంస్థ పరంగా కొన్ని వైఫల్యాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. వాళ్లు చేసిన కొన్ని ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జననాల రేటు పెంచేందుకు జపాన్‌ వినూత్న పథకం

మీకు తెలుసుగా.. జపనీయులు పని చేయడానికి ఎంతో ఉత్సాహం చూపుతారు. కార్ఖానాలో అడుగుపెట్టాక పని గంటలను పట్టించుకోరు. తోటి వారితో పోటీపడి తమ పని తీరునీ, ఉత్పాదకతనీ, స్థాయినీ పెంచుకుంటూ పోతుంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారి పరిస్థితి విచిత్రంగా తయారైంది. చాలామంది అధిక ఆదాయం కోసం ఆఫీసుల్లో ఓవర్‌డ్యూటీలు, నైట్‌ డ్యూటీలు చేయడమూ అధికమైంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకై కొన్ని సంస్థలైతే తక్కువ పని చేయండి అంటూ సూచించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రెండోసారి.. అందుకోసమే ట్రంప్‌ ఆరాటం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలోనూ ట్రంప్‌కు సరైన ప్రణాళిక లేదని విరుచుకుపడ్డారు. అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తరపున ఒబామా ప్రచారం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వదినే వ్యభిచార గృహానికి అమ్మేసింది..

ఆ బాలికను సొంత వదినే వ్యభిచార గృహానికి అమ్మేసింది. లోకం పోకడ ఎరుగని ఆమె నిర్వాహకుల స్వార్థానికి పావుగా మారింది. తాను పుండై విటులకు పండుగా మారింది. హింసను భరించలేక తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. గతంలో సంచలనం రేకెత్తించిన ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకుండటంతో సోదరుని ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. కన్న తల్లిలా చూడాల్సిన వదిన ఆ బాలికను ఈ ఏడాది జులైలో సింగరాయకొండకు చెందిన ఓ మహిళకు విక్రయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజస్థాన్‌ మరో విజయం

ముంబయి నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌స్టోక్స్‌(107 *; 60 బంతుల్లో 14x4, 3x6) శతకంతో కదం తొక్కగా, సంజూశాంసన్‌(54*; 31 బంతుల్లో 4x4,3x6 ) అర్థ శతకంతో మెరిశాడు. దీంతో రాజస్థాన్‌ మరో వికెట్ పడకుండా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు రాబిన్‌ ఉతప్ప(13), కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌(11) పాటిన్‌ సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. 44/2తో కష్టాల్లో ఉన్న జట్టును స్టోక్స్‌, సంజూ బాధ్యతాయుతంగా ఆడి ఆడుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మన క్రికెటర్లూ ఆహార ప్రియులే..!

10. జూలో హాలోవీన్‌ ఫెస్టివెల్‌



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.