close

తాజా వార్తలు

Published : 27/10/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. వచ్చే వారంలోనే కరోనా టీకా?

కరోనా నివారణ దిశగా ఎన్నో ఆశలు రేపుతున్న ఆస్ట్రాజెనెకా టీకా అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు ప్రముఖ బ్రిటన్‌ పత్రిక ‘ద సన్‌’ పేర్కొంది. టీకాల తొలి బ్యాచ్‌ను వచ్చే వారంలో స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఆదేశాలు వెళ్లాయని ఆ పత్రిక సోమవారం ప్రచురించిన కథనంలో వెల్లడించింది. టీకాను ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) నవంబరు 2 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఆస్ట్రాజెనెకా టీకాల తొలి దశ పంపిణీ చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు పత్రిక తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు

2. జల్‌శక్తి ఝలక్‌!

ఒకే అంశంపై రెండు పూర్తి భిన్నమైన వైఖరులను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించడం నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు పంపిన మినిట్స్‌లో జల్‌శక్తి శాఖ వైఖరి కొత్త వివాదానికి తెరలేపినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం, ఈ ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు(డీపీఆర్‌) ఇమ్మని బోర్డులు లేఖలు రాయడం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వారి చర్య కోర్టు ధిక్కరణే!

‘‘ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల సత్వర విచారణకు నేను సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశా. దానిపై సుప్రీంకోర్టును ప్రభావితం చేసేందుకు అవినీతి నిరోధకచట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల కింద నమోదైన 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. సుప్రీం/హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు’’ అని భాజపానేత, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాష్ట్రంలో రాచరిక పాలన

 దుబ్బాక ఉప ఎన్నికల్లో అప్రజాస్వామికంగా గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావును అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని.. అభ్యర్థి బంధువుల ఇళ్లపై దాడి చేసి సోదాలు చేయడాన్ని ఆయన ఖండించారు.  సోమవారం కరీంనగర్‌లోని తన కార్యాలయంలో సంజయ్‌ ఉండి.. బయటి నుంచి తాళం వేసుకుని నిర్బంధ దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, దుబ్బాకలో దొడ్డిదారిన గెలవాలని సీఎం కేసీఆర్‌ కుట్రపన్నుతున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నగదు దొరికినా నాటకాలేంటి

5. ఆరోగ్య పరిమళం!

పూల సుగంధానికి మది పరవశిస్తుంది. వంటకాల ఘుమఘుమకు ఆకలి రగులుతుంది. అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అత్తరు వాసనకు తనువు ఆకర్షితమవుతుంది. అంతా పరిమళాల మాయ! మన జీవితం కూడా ఉమ్మనీటి వాసనతో తల్లిని గుర్తించటంతోనే మొదలవుతుంది. మనసుకు ఉల్లాసం కలిగించటం దగ్గర్నుంచి ఒత్తిడిని తగ్గించటం వరకూ పరిమళాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటి ప్రాధాన్యాని వైద్యులు ఏనాడో పసిగట్టారు. మనసుకూ శరీరానికీ అవినాభావ సంబంధముందని, ఆ మాటకొస్తే చాలా జబ్బులు మానసిక అస్తవ్యస్థ స్థితి నుంచే పుట్టుకొస్తున్నాయని గుర్తించి చికిత్సల కోసమూ వినియోగించుకున్నారు. ఇది క్రమంగా ప్రత్యేక పరిమళ చికిత్స(అరోమా థెరపీ)గానూ అవతరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మనసెరిగిన రాకుమారి!

నిజమైన రాచరికం అంటే కోటలో ఉండటం కాదు ప్రజల గుండెల్లో ఉండటమే అని నమ్మారు దియాకుమారి... అందుకే రాజభవనాల ద్వారాలని తెరిచి అక్కడ మహిళలకు కావాల్సిన నైపుణ్యాలని అందిస్తూ వారి ఆర్థికస్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నారీ రాజకుమారి... ఫ్యాషన్‌ రాజధాని ప్యారిస్‌కేకాదు... లండన్‌, ఆస్ట్రేలియాలకు సైతం పీడీకేఎఫ్‌ తమ ఫ్యాషన్‌ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పీడీకేఎఫ్‌ అంటే ‘ప్రిన్స్‌ దియాకుమారి ఫౌండేషన్‌’ అని అర్థం. పేద మహిళల ఆర్థికసాధికారతే లక్ష్యంగా సాగుతున్న ఈ సంస్థ జైపుర్‌లోని సిటీప్యాలెస్‌లో ఉన్న బాదల్‌మహల్‌లో నడుస్తోంది. దీన్ని ప్రారంభించిన దియాకుమారి మరెవరోకాదు... జైపుర్‌ రాజమాత గాయత్రీదేవి మనవరాలే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పురుషులకూ చిన్నారుల సంరక్షణ సెలవు

పురుష ప్రభుత్వ ఉద్యోగులూ చిన్నారుల సంరక్షణ సెలవు(చైల్డ్‌కేర్‌ లీవ్‌) తీసుకోవచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ తెలిపారు. అయితే కేవలం తండ్రి ఉన్నవారికే (సింగిల్‌ మేల్‌ పేరెంట్‌) ఈ వెసులుబాటు వర్తిస్తుందన్నారు. భార్య చనిపోయిన, విడాకులు ఇచ్చిన తండ్రులు తమ బిడ్డల బాధ్యతలను చూసుకోవడానికి ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినా తగినంత ప్రచారం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రైలు పట్టాలపై ‘ప్రైవేటు’ కూత!

‘జాతీయ రహదారులపై ప్రైవేటు వాహనాలు, గగనమార్గంలో ప్రైవేటు విమానాలు పయనిస్తున్నప్పుడు... మన రైలు పట్టాలపై ప్రైవేటు రైళ్లు ఎందుకు పరుగులు తీయకూడదు?’- 2012లో ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ సదస్సులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ లేవనెత్తిన ప్రశ్న ఇది. 2014లో మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టాక భారతీయ రైల్వే- ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించే దిశగా అడుగులు మొదలుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చారిత్రక తప్పిదంతో తిప్పలు

నగోర్నో-కరబాఖ్‌ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడచిన మూడు దశాబ్దాలుగా ఆర్మీనియా, అజర్‌బైజాన్‌ల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి. 1990లలో ఆర్మీనియా వేర్పాటువాదులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అజర్‌బైజాన్‌ తో దాదాపు పూర్తి స్థాయి యుద్ధమే సంభవించింది.  అందులో 30,000 మంది మరణించారు. తాజాగా కొన్ని వారాల నుంచి జరుగుతున్న సంఘర్షణలలో దాదాపు 5000 మంది మరణించారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వరుసగా 5.. పట్టికలో 4

ఈ ఐపీఎల్‌లో ఇక ముందుకెళ్లడం కష్టమే అనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకున్న పంజాబ్‌.. అదిరే ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్‌.. తర్వాత వరుసగా అయిదో విజయంతో ప్లేఆఫ్స్‌కు గట్టి పోటీదారుగా మారింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో కోల్‌కతాను మట్టికరిపించింది. షమి, స్పిన్నర్ల చక్కని బౌలింగ్‌తో నైట్‌రైడర్స్‌ను చుట్టేసిన పంజాబ్‌.. మన్‌దీప్‌, గేల్‌ల మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించింది. 12 మ్యాచ్‌ల్లో ఆరో విజయం సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రోహిత్‌ ఔట్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.