close

తాజా వార్తలు

Published : 28/10/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. బిహార్‌ ఓటరు ఎటువైపో..?

బిహార్‌లో ఓట్ల పండుగ మొదలైంది. తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు మూడు విడతల్లో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆరు జిల్లాల్లోని 72 స్థానాలకు ఇవాళ తొలిదశ పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 1,066 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నగరా మోగినప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించిన ఆయా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో వేడి పుట్టించాయి. అధికార, విపక్ష కూటముల పొత్తులు, కొత్త ఎత్తులు, ప్రచారంలో హేమాహేమీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిహార్‌ మార్మోగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బిహార్‌లో ప్రారంభమైన తొలి దశ పోలింగ్‌..

2. అవినీతి కేసుల్లో జాప్యం.. కుంభకోణాలకు పునాదే

దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోన్న భారీ అవినీతి దేశానికి పెను సవాల్‌ విసురుతోందని, చెదపురుగులా పట్టి తొలిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా మారిన కుంభకోణాలు కొన్ని రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో అంతర్భాగమై పోయాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడకపోతే, ఆ తర్వాత వచ్చే తరం మరింతగా రెచ్చిపోతుందని హెచ్చరించారు. నల్లధనం కూడబెట్టే వారిపై ఎలాంటి చర్యలు లేకపోయినా, చిన్న శిక్షతో సరిపెట్టినా చుట్టుపక్కలున్న వారికి మరింత ధైర్యం వస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇక కశ్మీర్‌లోనూ భూమి కొనొచ్చు

ఇన్నాళ్లూ చుట్టపుచూపుగా, పర్యాటక కేంద్రంగా మాత్రమే నిల్చిన కశ్మీరం ఇక భారతీయులందరికీ నివాస యోగ్యం కాబోతోంది!  జమ్మూ-కశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని నిరూపించే ప్రక్రియలో భాగంగానే కాకుండా... ఇక్కడ పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో  కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో చరిత్రాత్మక నిర్ణయం వెలువరించింది. కశ్మీర్‌ భూ చట్టాల్లో మార్పులపై గెజిట్‌ విడుదల చేసింది. దీని ప్రకారం-  భారత దేశంలోని ప్రజలు ఎవరైనా కశ్మీర్‌లోనూ ఇక భూమి కొనుగోలు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మేం భారత్‌ వెంటే..

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో బుసలు కొడుతున్న చైనాకు అమెరికా విస్పష్ట హెచ్చరిక జారీ చేసింది. భారత్‌కు తమ అండ ఉన్న సంగతిని గుర్తుచేసింది. సార్వభౌమత్వం, స్వేచ్ఛను కాపాడుకునేందుకు భారత్‌ చేసే ప్రయత్నాల్లో నిరంతరం వెన్నంటి నిలుస్తామని ఉద్ఘాటించింది. దిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక ‘2+2 చర్చలు’ ముగిసిన అనంతరం ఈ మేరకు కీలక ప్రకటనలు చేసింది. తాజా చర్చల్లో భారత్‌, అమెరికా మొత్తం ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘స్థానిక’ ఎన్నికలపై నేడు అభిప్రాయ సేకరణ

పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ బుధవారం సేకరించనున్నారు. దీనికి అధికార పార్టీ వైకాపా తరఫున ఎవరూ హాజరు కావడం లేదు. అభిప్రాయ సేకరణకు హాజరు కావాలని 19 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం నుంచి ఇప్పటికే సమాచారాన్ని పంపారు. కొవిడ్‌ కారణంగా మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏడు భవనాలు ఎవరి కోసం?

6. పట్టపగలే విద్యార్థిని హత్య

 హరియాణాలో పట్టపగలే ఓ విద్యార్థినిని యువకుడు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన సంచలనం రేకెత్తించింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతోనే ఆ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకున్నానంటూ పోలీసులతో చెప్పడం అతడి రాక్షసత్వానికి అద్దం పడుతోంది. ఫరీదాబాద్‌ జిల్లాలోని బల్లబ్‌గఢ్‌లో జరిగిన ఘటన వివరాలివీ. నికితా తోమర్‌ బీకాం చివరి సంవత్సరం విద్యార్థిని. సోమవారం పరీక్ష రాసి తిరిగొస్తుండగా తౌసీఫ్‌ అనే యువకుడు రిహాన్‌ అనే వ్యక్తితో కలసి కారులో వచ్చి ఆమెను అడ్డగించాడు. కారులో బలవంతంగా తీసుకెళ్లే యత్నం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సంబంధం లేకుంటే.. అరగంటలో ఎందుకొచ్చారు!

 ఒక వ్యక్తి ఇంట్లో దొరికిన డబ్బుతో సంబంధం లేకపోతే దుబ్బాకలో ప్రచారం చేస్తున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అరగంటలోనే ఎందుకు సిద్దిపేట చేరుకున్నారో చెప్పాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తన ఇంట్లో ఉంచిన నగదు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే తెచ్చారని ఆ ఇంటి యజమానే చెబుతున్నట్లుగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయన్నారు. దీంతో భాజపా నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆమె కాళ్లు కుంచె పట్టాయి!

పుట్టుకతోనే చేతుల్లేకుండా ఉన్న స్వప్నని చూసి... ‘ఈ పిల్లని ఎవరికైనా ఇచ్చి బరువు దించుకోండి’, ‘ఏదైనా ఆశ్రమంలో వదిలేస్తే మంచిది’... ఇలా తలో సలహా ఇచ్చారు. ఆ పిల్లని ఎలా పెంచాలో తల్లిదండ్రులకూ పాలుపోలేదు. కానీ స్వప్న అగస్తిన్‌ మాత్రం కాలితో కుంచెపట్టి తన గెలుపుకథని రాసుకుంది. అందమైన తంజావూరు చిత్రాలు, నయనమనోహరమైన ప్రకృతి చిత్తరువులు... ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఆ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌కి ఎక్కడలేని అందాన్నీ తెచ్చిపెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. స్టాక్‌మార్కెట్‌ ఏమవుతుందో?

నవంబరు 3, 2020.. అమెరికా అధ్యక్షుడి ఎన్నిక జరిగే తేదీ. అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్‌ ట్రంప్‌నే వరిస్తుందా, లేక డెమోక్రాట్ల ప్రతినిధి జో బైడెన్‌ గెలుస్తారా అనే విషయమై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే రోజది. అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేదెవరో, మరో వారం రోజుల్లో తేలిపోతుంది. దీని కోసం అమెరికా ప్రజలతో పాటు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లనూ ప్రభావితం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కొద్దిరోజులుగా సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి కూడా. ఫలితంగా మదుపరులు ఎంతో అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభావం మన స్టాక్‌మార్కెట్లపై ఎలా ఉంటుంది.. అనేది అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘బ్రేక్‌ టైం’లో పంజాబ్‌ ఏం తాగింది? 

‘బ్రేక్‌ టైంలో వీళ్లేం తాగారో కనుక్కోవయ్యా. కాస్త మనవాళ్లకు కూడా పడదాం’- సై సినిమాలో భయపెట్టిన భిక్షూ యాదవ్‌ జట్టుపై నితిన్‌ టీం వరుసగా పాయింట్లు చేస్తుంటే పోలీసు అధికారి చెప్పిన డైలాగ్‌ ఇది. ఐపీఎల్‌లో పంజాబ్‌ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తొలి అర్ధభాగంలో వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయిన అదే జట్టు.. మలి అర్ధభాగంలో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి సంచలనం సృష్టించింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఒడిసిపట్టింది. మరి ఇంతకీ రాహుల్‌ సేన ఇంటర్వెల్‌లో ఏం చేసిందో తెలుసా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కసిగా కొట్టేశారు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.