
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. దిగొచ్చిన ట్రంప్
ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని సదరు యంత్రాంగాన్ని ఆదేశించారు. పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తూనే.. ఎన్నికల ఫలితాలపై తాను చేస్తున్న పోరాటం కొనసాగుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నివర్ ముప్పు
నివర్ తుపాను ముప్పు తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్‌పైనా ఉండనున్నట్లు తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి. బుధవారం తీవ్ర తుపానుగా తీరం దాటాక... అదేరోజు అదే తీవ్రతతో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ జిల్లా మీదుగా వెళుతుండగానే అది వాయుగుండంగా బలహీనపడే అవకాశాలున్నాయి. సోమవారం రాత్రి వరకున్న సమాచారం ప్రకారం.. పుదుచ్చేరిలోని కరైకల్, మామల్లపురం(మహాబలిపురం) మధ్య తీరం దాటేప్పుడు గంటకు 100 కి.మీ నుంచి 120 కి.మీ దాకా గాలులు వీచే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,65,049కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. వైకాపాలో.. ఢీఆర్సీ
‘నా నియోజకవర్గంలో నీ జోక్యమేంటి? నీ పని నువ్వు చూసుకో. అధికార పక్షం తరఫున మాట్లాడుతున్నావా? ప్రతిపక్షం తరఫునా? ఏమైనా ఉంటే నాతో చెప్పాలి కదా. నేనేం చచ్చిపోలేదు కదా’ అని రాజ్యసభలో వైకాపా సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై.. కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విరుచుకుపడ్డారు. దీంతోపాటు అసభ్యపదజాలంతో దూషించారు. ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. మధ్యలో సర్దిచెప్పబోయిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ద్వారంపూడి వెనక్కినెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. డ్రైవర్ సీట్లో... ఆశ!
ఎనిమిదో తరగతిలోనే పల్సర్‌ని అవలీలగా నడిపేసిన చల్లా ఆశ.. ఇప్పుడు బస్సుని కూడా అంతే సునాయాసంగా నడిపేసి వార్తల్లోకి ఎక్కింది. త్వరలో ఆర్టీసీలో మొదటి మహిళా డ్రైవర్‌గా చేరే అవకాశాన్ని పొందింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఈ యువ ఇంజనీర్‌కి హెవీవెహికల్స్ అంటే అమితమైన ఆసక్తి. అదే.. మొదటిసారి ఆర్టీసీ స్టీరింగ్ పట్టిన అమ్మాయిగా గుర్తింపు తెచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు!
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి.. రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సోమవారం మరో లేఖ రాసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పునరుద్ఘాటించారని సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 17న తాను జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఆ లేఖకు జత చేసినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ప్రభుత్వానికి ఆ అధికారం లేదు
7. కార్పొరేట్లు బ్యాంకులు పెడితే ఎలా?
ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్లను అనుమతించాలంటూ రిజర్వు బ్యాంకు కార్యాచరణ బృందం చేసిన సిఫారసులపై పెద్ద దుమారమే రేగుతోంది. భారీమొత్తం రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే కార్పొరేట్లకే బ్యాంకుల పగ్గాలు ఇస్తే ఎలా రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య వంటి దిగ్గజ బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్నవారికి రుణాలు అందకపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా భారత్‌లో కార్పొరేట్ ఎగవేతలు జరుగుతుంటే.. అవేమీ పట్టనట్లు వారికే బ్యాంకు ప్రమోటర్లుగా అనుమతినివ్వాలనడం ఎంత మేరకు సబబు అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సజీవ దహనం
అభివృద్ధిలో దేశం కొత్త పుంతలు తొక్కుతున్నా..ప్రజలు ఆధునిక పోకడలను వంటబట్టించుకున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ అమానుషాలకు ఒడిగడుతున్నారు. అనుమానాలతో అమాయకులను అతిదారుణంగా హతమారుస్తున్నారు. బాధితుల కుటుంబాలకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు ఇటువంటి అనుమానాలతో దారుణహత్యలకు గురయ్యారు. అందులో ఒకరు పరామర్శకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీరు కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. చిత్రసీమకి వరాల ఉత్సాహం
సినిమా థియేటర్లు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకుడికే కాదు... సినీ పరిశ్రమ వర్గాల్నీ ఉత్సాహ పరిచేలా, కరోనా కష్టనష్టాల్ని మరిచి భరోసాతో ముందడుగు వేసేలా తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. థియేటర్లని ఎప్పుడైనా తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో పాటు...రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్మెంట్, థియేటర్లకి కనీస విద్యుత్ ఛార్జీల రద్దు, ప్రదర్శనల సంఖ్య పెంచుకోవడం, టికెట్ ధరల్లో సవరణలు చేసుకునే వెసులుబాటుపై కేసీఆర్ ప్రకటన చేయడంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇక నోటితో కాదు.. ఆటతోనే
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే.. ఆటగాళ్లు ఒకర్నొకరు దూషించుకోవడం.. కవ్వించుకోవడం.. కోపాలు.. ఇలా ఇవన్నీ ఆటలో భాగంగా ఉంటాయి. ఇక కంగారూ గడ్డపై మ్యాచ్ అంటే ఆ జట్టు క్రికెటర్లు ఏ విధంగా రెచ్చిపోతారో తెలిసిందే. కానీ ఈ సారి భారత్‌తో సిరీస్‌లో మాత్రం తన నోటికి పని చెప్పనని.. భారత ఆటగాళ్లు కవ్విస్తే బ్యాట్‌తోనే సమాధానమిస్తానని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. సోమవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడిన అతను.. తన అంతర్జాతీయ కెరీర్‌పై, భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
