close

తాజా వార్తలు

Updated : 27/11/2020 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ప్రజల చెవుల్లో కమలం పువ్వులు

భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రణాళిక...తెరాస ఎన్నికల ప్రణాళికకు మక్కికి మక్కి కాపీ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఇప్పటికే భాజపా హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుందని, అదే మాదిరిగా ఎన్నికల ప్రణాళికలోని హామీలన్నీ దిగుమతి చేసుకున్నవేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టీకా డోసుల్లో పొరపాటు..!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా టీకా డోసుల ప్రక్రియలో తప్పు జరిగింది. అందువల్లే ఆ వ్యాక్సిన్‌ ప్రయోగాల ప్రాథమిక ఫలితాలు పలు సందేహాలకు దారితీశాయని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. టీకా తక్కువ మోతాదు తీసుకున్న వారిలో ఎక్కువ పనితీరు, ఎక్కువ డోసు తీసుకున్నవారికి తక్కువ పనితీరు కనబరచటంపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. తాజా పరిణామం నేపథ్యంలో ఈ టీకా సమర్థతపై పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో కొత్తగా 761 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,242 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 761 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అవసరానికి మించి అప్పు చేస్తే...

అవసరం ఏదైనా అప్పు తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయ్యింది. ఇది పరిమితి మించితే మాత్రం  ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. ఇలా అధిక రుణం తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటి? భవిష్యత్తులో కొత్త రుణాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఏం అవుతుంది? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీకా.. ఎందాకా!

 దాదాపు తొమ్మిది నెలలుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడుగా టీకా తయారు చేసే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకోడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 28న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ను సందర్శించనున్నారు.దేశీయంగా ‘కరోనా’ టీకా తయారీ యత్నాల్లో భారత్‌ బయోటెక్‌ క్రియాశీలకంగా ఉన్న సంగతి విదితమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నిండాముంచిన నివర్‌

నివర్‌ తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని దాటుతూ  పుదుచ్చేరితోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో తీవ్ర నష్టాన్ని కలిగించింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను అతలాకుతం చేశాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆరోగ్యమే ‘టీకా’ తాత్పర్యం!

ప్రపంచదేశాల్లో మహమ్మారి కొవిడ్‌ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు దొర్లడం, తద్వారా కరోనా పెచ్చరిల్లడం జరిగింది. సమస్య మరింత విస్తృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో... దీనికి శాశ్వత పరిష్కారంగా టీకా ఆవిష్కరణ అంతే తప్పనిసరి అని ప్రపంచ దేశాలన్నీ పరితపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విశృంఖల వినోదానికి ముకుతాడు!

సినిమాలు, సీరియళ్లకు పోటీగా వినోదరంగంలో నయా ఆకర్షణగా మారిన ఓటీటీలు... అశ్లీల దృశ్యాలు, అసభ్య సంభాషణలు, హింసను ప్రసారం చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, హంగామా, వూట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ సహా దేశంలోని దాదాపు 40 ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) వేదికలను ఇక నిశితంగా పర్యవేక్షించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

మరికొద్దిసేపట్లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తొలి వన్డే ఆడనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడనుండటం విశేషం. మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి టెస్టు ఆడిన కోహ్లీసేన తర్వాత మరే జట్టుతోనూ క్రికెట్‌ ఆడకపోవడం తెలిసిన సంగతే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తుది సమరానికి

కోలార్‌ బంగారు గనులను చేజిక్కించుకునేందుకు అధీరాతో తుది సమరానికి సిద్ధమయ్యారు రాకీ భాయ్‌. భాగ్యనగర వేదికగా జరిగే ఈ ఆఖరి ఘట్టం కోసం.. హైదరాబాద్‌లోకి అడుగుపెట్టారు రాకీ. మరి ఈ పోరులో గెలుపెవరిది? కోలార్‌ బంగారు గనులు ఎవరి అధీనంలోకి వెళ్లాయి? అన్నది తెలియాలంటే ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌:2’ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన