close

తాజా వార్తలు

Updated : 29/11/2020 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. చైనాకు మార్కోస్‌ వేడి!

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా దురుసు వైఖరికి గట్టిగా చెక్‌ పెట్టేందుకు భారత్‌ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా ప్రత్యేక బలగాలను దించింది. తాజాగా నౌకాదళంలోని మెరికల్లాంటి మెరైన్‌ కమాండోల (మార్కోస్‌)ను మోహరించింది. ఏప్రిల్‌, మే నెల నుంచి భారత్‌, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ వస్తాడని దిల్లీ నేతల గజగజ

‘‘దేశంలోని కఠోరమైన వాస్తవాలు బయటపెట్టాం. కాంగ్రెస్‌, భాజపాలు దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాయి. దేశంలో పేదరికం ఎందుకు ఉంది? విద్య సరిగా అందదు. వైద్యం దొరకదు. ఇళ్లులేని పేదలు ఇంకా ఎందుకు ఉన్నారు? ఎన్నిరోజులు ఓపిక పట్టాలి? కొత్త ఆలోచనలు, కొత్తమార్పు రావాలి. కేసీఆర్‌ మాయమైపోతారన్నవాళ్లే మాయమైపోయారు. దేశంలో కొత్త పంథా రావాలన్నందుకు దిల్లీలో గజగజ వణుకుతున్నారు. నన్ను ఇక్కడే ఆపాలని వరదలా బయలుదేరారు’’ అని కేసీఆర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 805 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,455కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 948 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అత్యవసర వినియోగానికి 2 వారాల్లో దరఖాస్తు

4. తత్ప్రణమామి సదాశివలింగం..!

కుమారస్వామిని పెంచిన కృత్తికల పేరిట వచ్చినదే కార్తికమాసం. అందుకే ఇది పరమశివుడికి ప్రియమైన మాసం. సృష్టి ఆరంభం జరిగిందీ త్రేతాయుగం మొదలైందీ ఈ నెలలోనే... ఇలా మరెన్నో విశేషాలతో నిండిన కార్తికంలో లింగరూపంలో కొలువైన ఆ మహేశ్వరుడిని దర్శించుకుని పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తుంటారు భక్తులు. అందుకే పంచముఖుడైన పరమశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలూ పంచభూతలింగాలూ పంచారామాలూ... వంటి సుప్రసిద్ధ శైవక్షేత్రాలతోపాటు అరుదైన నిర్మాణంతో ప్రాచుర్యంలోకి వచ్చిన శివలింగాల్నీ సందర్శిస్తుంటారు. అలాంటి ప్రత్యేకతలతో అలరారే శివలింగాల్లో కొన్ని... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆయనకు అనుమానం...

మీరు తనకంటే ఉన్నతస్థానంలో ఉన్నారనే ఆత్మన్యూనతతో బాధపడుతూ.. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఆయనలా ప్రవర్తిస్తున్నారేమో. ఇలాంటి మానసిక సమస్యతో బాధపడేవారు తమ ఆత్మీయులు ఇతరులతో మాట్లాడటం, సఖ్యతగా ఉండటం... లాంటివి చూసి తట్టుకోలేరు. ‘నేను చిన్న ఉద్యోగం చేస్తున్నా. కాబట్టి నాకు గౌరవ ఇవ్వడం లేదు.ఆఫీసులో తన సహోద్యోగులతో బాగా ఉంటోంది. ఇలానే ఉంటే కొన్నాళ్లకు నాకు దూరం అవుతుందేమో’ అనే విపరీతమైన ఆలోచనలు, అభద్రత మీవారికి ఉన్నట్లు అతడి మాటల ద్వారా అర్థం అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. రూ.లక్షన్నర మందులు... 8 వేలకే తెచ్చాం!

నాట్కో ఫార్మా... మనదేశంలో క్యాన్సర్‌ రోగులకి ఈ సంస్థ ఓ సంజీవనీ పర్వతం లాంటిది. ఒకప్పుడు బ్లడ్‌ క్యాన్సర్‌ చికిత్సకి నెలపాటు వాడాల్సిన మందులకి మనదేశంలో లక్షన్నర రూపాయలయ్యేవి. నాట్కో సంస్థ ఆవిష్కరించిన ‘జనరిక్‌ మందుల’తో ఆ ఖర్చు ఎనిమిది వేలకి తగ్గింది. ఈ అభినవ సంజీవనిని సృష్టించిన అపర రుషి వెంకయ్య చౌదరి నన్నపనేని. కొత్త ఔషధాల ఆవిష్కరణల కోసం 50 ఏళ్లుగా నిర్విరామకృషి చేస్తున్న ఆయన ఎంత ప్రయోగశీలో... సేవాతత్పరతలో అంత వితరణశీలి. ఆ ప్రస్థానం వీసీ నన్నపనేని మాటల్లోనే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. కూతురు కోసం... 14 మంది కొడుకులు!

కొంతమంది తమకు అమ్మాయి పుడితే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది అబ్బాయే కావాలనుకుంటారు. పుట్టింది ఏ బిడ్డ అయినా ఒకరిద్దరితో ఆపేస్తారు. కానీ అమెరికాకు చెందిన కేట్రీ, జే దంపతులు మాత్రం అలాకాదు. ఆడపిల్ల పుట్టే వరకూ వరసగా 14 మంది మగపిల్లలకు జన్మనిచ్చారు! వీరికి 1993లో పెళ్లయ్యింది. అప్పటి నుంచీ ఆ ఇంట వరసగా మగపిల్లలే పుడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. ప్రియుడి కోసం సుపారీ హత్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. అత్యంత దారుణంగా వ్యవహరించింది. ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఆమె.. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను సైనైడ్‌తో చంపించింది. ఈ హత్య కేసును ఛేదించిన తీరును గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ శనివారం మీడియాకు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 తాళ్లూరుకు చెందిన భాష్యం బ్రహ్మయ్య (42) గ్రామంలో హోటల్‌, పాల దుకాణం నడిపేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. నాన్నే అంతా!

విజయ్‌ దేవరకొండ పక్కన హీరోయిన్‌ అంటే... అదీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అయితే... ఆ కాంబినేషన్‌ మీద చాలా అంచనాలే ఉంటాయి. వాటిని అందుకునేలా, ప్రేక్షకులను మెప్పించేలా విజయ్‌ సినిమాలో తళుక్కున మెరవబోతోంది బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే. టాలీవుడ్‌ ప్రేక్షకులను తొలిసారిగా పలకరించబోతున్న అనన్య... ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాలూ అభిప్రాయాలూ చెబుతోందిలా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

మొదలవనుంది కోలాహలం

10. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత్‌xఆస్ట్రేలియా జట్ల మధ్య మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన ఆరోన్‌ ఫించ్‌ టీమ్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మరికాసేపట్లో ప్రారంభమయ్యే రెండో వన్డేలో టాస్‌ గెలిచిన ఫించ్‌ మరోసారి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

కోహ్లి-రోహిత్‌ మాట్లాడుకోరా?


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని