
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. అందరి చూపు.. తలైవా వైపు
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్ఎంఎం(రజనీ మక్కళ్ మండ్రం) నిర్వాహకులతో రజనీకాంత్ సోమవారం సమావేశంకానున్నారు. రాజకీయ అరంగేట్రం గురించి చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన అధికార, ప్రతిపక్షాలు ఈ సమావేశంపై దృష్టి పెట్టాయి. దీంతో సరికొత్త అంచనాలు, విశ్లేషణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మాతోనే విశ్వ ఐటీహబ్
హైదరాబాద్‌ను విశ్వ ఐటీ హబ్‌గా రూపుదిద్దడం భాజపాతోనే సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఈ నగరానికి నిజాం సంస్కృతి పరిపాలన నుంచి విముక్తి కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. అవినీతిని దూరం చేసి కార్పొరేషన్ బడ్జెట్ పెంచుతామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ‘డ్రోనా’చార్యులదే భవిష్యత్తు
నగర్నో-కరాబక్ యుద్ధ సంధి ఒప్పందం ప్రకారం ఆర్మేనియా నుంచి స్వాధీనం చేసుకొన్న కల్బజర్ ప్రాంతంలోకి నవంబరు 25న అజర్ బైజాన్ సేనలు అడుగుపెట్టాయి. భారత్ ఈ యుద్ధం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఆధునిక ఆయుధ తీరుతెన్నులను వేగంగా అందిపుచ్చుకోకపోతే భవిష్యత్తులో భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అన్నదాతల ధర్మాగ్రహం
మన భారతంలో అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు- జాతి ఆహార భద్రతకు నిష్ఠగా నిబద్ధమైన కర్షకుడు! కాయకష్టాన్ని కాస్తంత అదృష్టాన్ని నమ్ముకొని స్వేదం చిందిస్తూ, చీడపీడలు ప్రకృతి విపత్తులతో ఒంటరి పోరాటం చేస్తూ ధాన్యాగారాన్ని నింపుతున్న రైతు- తన జీవన భద్రతకే ముప్పు ముంచుకొచ్చిందంటూ నేడు కదనశంఖం పూరిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఫొటొగ్యాలరీ: తెలుగు రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి వేడుకలు
5. కొవిషీల్డ్ టీకాపై దుమారం
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) రూపొందించిన కరోనా టీకా ప్రయోగ పరీక్షపై దుమారం చెలరేగింది. ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వల్ల తన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడిందని క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీరు ఆరోపించగా.. వాటిని సీరం సంస్థ ఖండించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* తెలంగాణలో కొత్తగా 593 కరోనా కేసులు
6. క్యాన్సర్ కబళిస్తుంటే బతికి సాధించాలి అనుకున్నా!
మరణం... భయంకరమైన నిజం. ఓ వ్యక్తి తాలూకు శరీరాన్నే కాదు, ఆశలనూ సమాధి చేస్తుంది. తన చుట్టూ నిర్మించుకున్న ప్రపంచాన్ని అనాథను చేస్తుంది. ముంబయిలోని క్యాన్సర్ ఆసుపత్రి... ఐసీయూలో ఉంది పదమూడేళ్ల రోమితా ఘోష్...శరీరంలో ఉన్న శక్తినంతా ఎవరో పిండేస్తున్నట్టు అనిపిస్తోందామెకు. అటూ ఇటూ తిరుగుతున్న నర్సులు, డాక్టర్ల మాటలు, అమ్మనాన్న ఆందోళన లీలగా తెలుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. లక్షణమైన ఉద్యోగ మార్గం
డిగ్రీ అర్హతతో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ పరీక్షల్లో ఏర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్) ఒకటి. ఈ పరీక్షను వాయుసేనలో ఉన్నతోద్యోగాల భర్తీకి ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఎంపికైనవారు ఏర్‌ఫోర్స్‌లో పైలట్, గ్రౌండ్ డ్యూటీ- టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. శిక్షణ సమయంలో స్టైపెండ్‌తోపాటు విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. సాధారణ డిగ్రీ, బీటెక్ పూర్తయినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు వీటికి పోటీ పడవచ్చు. మహిళలూ అర్హులే. తాజాగా వెలువడిన ఏఎఫ్ క్యాట్ - 2021(1) ప్రకటన వివరాలు చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పగబట్టిన విధి
ఆ తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. బిడ్డలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తుండడంతో మురిసిపోయారు. అంతలోనే విధి పగబట్టింది. కొన్నాళ్లు పిల్లలతో గడుపుదామని అక్కడికి వెళ్లిన ఆ దంపతులను, కుమారుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. కుమార్తె తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. అమెరికాలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. టాలీవుడ్.. కథ బాలీవుడ్.. కథనం
పెద్ద సినిమా.. చిన్న సినిమా.. అన్న హద్దులెప్పుడో చెరిగిపోయాయి. బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించినదే పెద్ద చిత్రంగా.. ప్రేక్షకుల్ని థియేటర్ వైపు లాక్కురాగల సత్తా ఉన్న కథే..నిజమైన హీరోగా నీరాజనాలు అందుకుంటున్న రోజులివి. ఈ మధ్య తెలుగులో ఇలాంటి కొత్తదనం నిండిన వైవిధ్యభరిత కథలు విరివిగా వస్తున్నాయి. అందుకే బాలీవుడ్ ఇటువైపు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతోంది. ఇక్కడ హిట్టు మాట వినపడిందంటే చాలు.. ఆ కథ కోసం ఎన్ని రూ.కోట్లు వెచ్చించడానికైనా వెనకాడటం లేదు. ఫలితంగా తెలుగు నుంచి హిందీకి ఎగుమతవుతున్న సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అదే ఆట.. ఓటమి బాట
అదే మైదానం.. అదే ప్రత్యర్థి.. అదే ఆటతీరు.. వెరసి టీమ్ఇండియాకు మరో ఓటమి! ఎలాంటి తడబాటు లేకుండా సాగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్.. స్మిత్ మరో మెరుపు శతకం.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో భారత్ వైఫల్యం.. పోరాడినా అందుకోలేని లక్ష్యం.. కోహ్లీసేనకు మళ్లీ తప్పని భంగపాటు! ఇదీ అచ్చం తొలి వన్డేలాగానే సాగిన రెండో మ్యాచ్‌లో వచ్చిన ఫలితం. భారత్ ఆట ఏమాత్రం మారని ఈ పోరులో.. అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి