close

తాజా వార్తలు

Updated : 01/12/2020 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌  తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  1999, 2004లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్‌ దంపతులు బంజారాహిల్స్‌లోని నందినగర్ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సురక్షితంగా ఓటేద్దాం

3. ఓటర్ స్లిప్‌ రాలేదా.. ఇలా చేయండి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధమయ్యారా. ఇప్పటికే మీ చేతికి ఓటర్ స్లిప్‌లు వచ్చుంటాయి. ఒక వేళ మీ ఓటర్ స్లిప్‌ ఇంకా రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓటర్ స్లిప్‌ను సులభంగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలా అంటారా.. ఇదిగో ఇలా చేయండి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

4. భాజపా, తెరాస మధ్య ఘర్షణ

 రాజధానిలోని నెక్లెస్‌ రోడ్డులో సోమవారం రాత్రి తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  వాహనశ్రేణిలోని ఓ వాహనంపై కొందరు దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం రాత్రి సంజయ్‌, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అనుచరులతో కలిసి నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో కొత్తగా 502  కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 46,597 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,318కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,461కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టీకా వేసేందుకు సిబ్బందిని గుర్తించండి

6. సభలో నివార్‌

సమావేశాలు ప్రారంభమైన రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధంతో శాసనసభ దద్దరిల్లింది. మాటల తూటాలతో హోరెత్తింది. తుపాను నష్టాలపై మాట్లాడేందుకు స్పీకరు అనుమతించినా.. తనను మాట్లాడనివ్వకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు ఆగ్రహºదగ్రుడై పోడియం వద్ద బైఠాయించారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆయనతో సహా మొత్తం 13 మంది తెదేపా సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేసేవరకూ వెళ్లింది. తర్వాత వారంతా అసెంబ్లీ ప్రధానద్వారం వద్ద బైఠాయించారు. ఆపై చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ అధికారపక్షం, ముఖ్యమంత్రి తీరుపై నిప్పులు చెరిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేటి నుంచి రోజంతా ఆర్‌టీజీఎస్‌

పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఉపయోగించే ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవలు డిసెంబరు 1 నుంచి రోజంతా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఆర్‌టీజీఎస్‌ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉండేవి. నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ ద్వారా రోజంతా లావాదేవీలు చేసేందుకు ఇప్పటికే అవకాశం ఉంది. ఈ పద్ధతుల్లో గరిష్ఠంగా రూ.2లక్షల మేరకు మాత్రమే ఖాతా నుంచి ఖాతాకు బదిలీ చేసేందుకు వీలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పులిరాజాను లేపొద్దు!

పులి పడుకుంది కదా అని వెర్రివేషాలు వేయొద్దు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ విషయంలో ఇప్పుడిలాంటి విజ్ఞతే కావాలి. జబ్బు గుట్టుమట్లు పట్టుబడటం, దీనిపై ప్రజల్లో అవగాహన పెరగటం, పరీక్షలకు వెనకాడకపోవటం, సత్వరం యాంటీరెట్రోవైరల్‌ చికిత్స (ఏఆర్‌టీ) ఆరంభించటం వంటి వాటితో  హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను గణనీయంగానే తగ్గించాం. ఒకరకంగా ఇప్పుడిది మధుమేహంలాంటి దీర్ఘకాలిక సమస్యగానూ మారి పోయింది. అలాగని ఆదమరిస్తే ప్రమాదాన్ని తిరిగి కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి వరల్డ్‌ ఎయిడ్స్‌ డే సందర్భంగా దీని గురించి మరోసారి తెలుసుకొని, జాగ్రత్త పడటం అవసరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పసిడి జోరుకు వ్యాక్సిన్‌ పగ్గాలు

ఇటీవలి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రూపంలో కళ్లెం పడింది. ఒక పక్క పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్నప్పటికీ.. దేశీయంగా కూడా పసిడి ధరలు నవంబరులో భారీగా పడ్డాయి. అంతర్జాతీయ విపణిలో చూస్తే, గత నాలుగేళ్ల కాలంలో, ఒక నెలలో బంగారం ధర ఇంతగా తగ్గడం ఇప్పుడే. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై పలు కంపెనీల ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుందనే నమ్మకం పెరగడం, పెట్టుబడిదార్లు మళ్లీ ఈక్విటీల వైపు మళ్లడం వల్ల పసిడిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నాయకా.. మేలుకో!

2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విజయాలను అందుకుంది. దీంతో అంతవరకూ ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను అందుకున్నాడంటూ కోహ్లి పేరు మార్మోగింది. కానీ రెండేళ్ల తర్వాత.. అదే ఆస్ట్రేలియాలో కోహ్లి నాయకత్వ వైఫల్యం చర్చనీయాంశం అవుతోంది. జట్టు వన్డే సిరీస్‌ కోల్పోవడంలో కెప్టెన్‌ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా విరాట్‌ నాయకత్వ సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మారడోనా ఆస్తి ఎవరికి?


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని