close

తాజా వార్తలు

Published : 19/05/2020 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో మరో 41 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు వచ్చాయి. మేడ్చల్‌ జిల్లా నుంచి మరో మూడు నమోదు అవ్వగా... 12 మంది వలస కార్మికులకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,592కి చేరింది. ఇప్పటి వరకు 34 మంది రాష్ట్రంలో మరణించారు. ఇవాళ మరో 10 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 556 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు కేంద్రం ప్రకటించినట్లుగానే తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేవలం కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు తప్ప మిగతావన్నీ గ్రీన్‌ జోన్‌లగానే పరిగణిస్తారు.అంతేకాకుండా కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి కొన్ని సడలింపులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అంతర్‌ రాష్ట్ర సర్వీసులను మాత్రం తెలంగాణలోకి అనుమతించరు. హైదరాబాద్‌ మినహా అన్ని చోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని, హైదరాబాద్‌లో మాత్రం సరిబేసి విధానాన్ని అమలు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన