
తాజా వార్తలు
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: రాజధాని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సచివాలయ భవనం కూల్చివేత పనులు వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతుండటంతో పోలీసులు అటువైపుగా వాహనాలను అనుమతించడం లేదు. సచివాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. సచివాలయభవనం కూల్చివేతకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎలాంటి ఆందోళనలు చేయకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
సుదీర్ఘ చరిత్ర కలిగిన సచివాలయం కూల్చివేత పనులు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ పొక్లెయిన్లతో ఈ పనులు చేపట్టారు. కొత్త నిర్మాణాలకు వీలుగా 25.5 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు సుమారు 12 నుంచి 15 రోజుల వరకు పడుతుందని అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. వాస్తు దోషాలను చక్కదిద్దేందుకు ఆ ప్రాంగణాన్ని చతురస్రాకారంగా తయారు చేసేందుకు వీలుగా మింట్ కాంపౌండ్ వైపు కొంత స్థలాన్ని, సచివాలయం ప్రధాన గేటు వైపు ఉన్న విద్యుత్తుశాఖ రాతి భవనాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.