ఆ పాఠశాలలపై తీసుకున్న చర్యలేంటి?:హైకోర్టు
close

తాజా వార్తలు

Published : 28/08/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పాఠశాలలపై తీసుకున్న చర్యలేంటి?:హైకోర్టు

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫీజులు, మధ్యాహ్న భోజనం అంశాలపై హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని.. చెల్లించకపోతే అడ్మిషన్‌ రద్దు చేస్తున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రీనివాస్‌ కోర్టుకు తెలిపారు. 

ఫీజులకు సంబంధించి ఇప్పటికే జీవోలు జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ న్యాయస్థానానికి వివరించారు. జీవో ఉల్లంఘించిన 27 పాఠశాలలకు నోటీసులు ఇచ్చామని, వాటిలో కొన్ని వివరణ కూడా ఇచ్చామన్నారు. గుర్తింపు రద్దు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఫీజులపై యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్తే బోయిన్‌పల్లి పోలీసులు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారని న్యాయవాది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారో వివరణ ఇవ్వాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని