
తాజా వార్తలు
మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి ప్రారంభమైంది. మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు వీఐపీ ఘాట్‌లో తుంగభద్ర పుష్కరిణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పుణ్యనదుల జలాలను తుంగభద్రలో కలిపి, బృహస్పతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి, పూజారులు, భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలాచరించారు. ఇవాళ్టి నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి.
తుంగభద్ర పుష్కర వేడుకల కోసం మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధానం సిద్ధమైంది. భక్తుల కోసం దర్శనాలు, పరిమళ ప్రసాదాలు, అన్నదానం తదితర ఏర్పాట్లను పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో అధికారులు సిద్ధం చేశారు. రోజూ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 రెండు గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉచిత దర్శనాలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. భక్తుల సంఖ్య పెరిగితే దర్శనం మరో గంట పాటు పెంచే అవకాశం ఉంది. దర్శనాల కోసం అదనంగా వరసలు, వీఐపీల కోసం ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు పరిస్థితులను బట్టి ప్రత్యేక గేటు ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. 12 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- తాగడానికి తగని సమయముంటదా..!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- ఐసీయూలో భారత దిగ్గజ స్పిన్నర్
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
