close

తాజా వార్తలు

Updated : 10/08/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌, ముంబయి, పుణెలలో

స్మార్ట్‌వర్క్స్‌కు 6 లక్షల చ.అ.కార్యాలయ స్థలం

దిల్లీ: కొవిడ్‌ సంక్షోభ సమయంలోనూ, భారీ విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్తోంది స్మార్ట్‌వర్క్స్‌ సంస్థ. కో వర్కింగ్‌ పద్ధతిలో కార్యాలయాలకు స్థలాన్ని అద్దెకు ఇచ్చే ఈ సంస్థ, హైదరాబాద్‌, ముంబయి, పుణెలలో 6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజ్‌కు తీసుకుంది. 2016 ఏప్రిల్‌లో ఏర్పాటైన స్మార్ట్‌వర్క్స్‌ కోవర్కింగ్‌ స్పేసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు దేశంలోని 9 నగరాల్లోని 31 కేంద్రాల్లో 40 లక్షల చ.అ. స్థలం, 60,000 సీట్లు ఉన్నాయి. సగటున ప్రతి కార్యాలయంలో 250-300 సీట్లు ఉండేలా ఈ సంస్థ చూసుకుంటోంది. గత మార్చి నుంచే హైదరాబాద్‌, ముంబయి, పుణెలలో 2 లక్షల చ.అ.కు పైగా స్థలాన్ని స్మార్ట్‌వర్క్స్‌లీజుకు తీసుకున్నట్లు సమాచారం.పెద్ద కార్పొరేట్‌ సంస్థలను దృష్టిలో పెట్టుకుని, 3 భారీ కోవర్కింగ్‌ కేంద్రాలను ఈ సంస్థ ఏర్పాటు చేస్తోందని తెలిపింది. ప్రాంతాన్ని, నగరాన్ని బట్టి సీటుకు రూ.6000-30000 వరకు ఈ సంస్థ వసూలు చేస్తోందని సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.