close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/01/2020 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోడి పందేల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

చింతలపూడి పట్టణం: పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చింతలపూడి మండలంలోని చింతంపల్లి గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తుండగా రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. స్థానికంగా మామిడితోటలో పందేలు నిర్వహిస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. గురువారం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఇద్దరు యువకులకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులతో కోడిపందేల విషయంలో వివాదం చోటు చేసుకొని గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన యువకులు మరికొంతమంది స్నేహితులతో కలిసి ఖమ్మం యువకులపై కర్రలతో దాడి చేశారు. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడికి దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సత్తుపల్లికి చెందిన మారేష్ తలకు తీవ్రగాయాలు కాగా, చింతలపూడికి చెందిన నాగు కాలు విరిగింది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.