రూ.426 కోట్లతో హైదరాబాద్‌లో వంతెనలు 
close

తాజా వార్తలు

Updated : 11/07/2020 14:26 IST

రూ.426 కోట్లతో హైదరాబాద్‌లో వంతెనలు 

హైదరాబాద్‌: నగరంలోని పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేశారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.426 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జి, మరో వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.350  కోట్లతో ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి, రెండో దశలో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు 3 లేన్ల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. రూ.76 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణానికి కిషన్‌రెడ్డి భూమిపూజ చేశారు. 

ఈ  సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రెండు వంతెనల నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేశామన్నారు. జీహెచ్‌ఎంసీలో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.‘‘ మార్చి నుంచి  ఇప్పటివరకు 4 రెట్ల వేగంతో జీహెచ్‌ఎంసీ పనులు పూర్తి చేశాం. రూ. 5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’’ అని అన్నారు. హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తామని  కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో  జనం రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని వంతెన నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు.  కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని