అత్యాచారాలపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
close

తాజా వార్తలు

Updated : 04/10/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యాచారాలపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య ఉదంతంతో దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తరచూ జరుగుతున్న సామూహిక అత్యాచారాలపై  ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన భాజపా ఎమ్మెల్యే అత్యాచారాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామరాజ్యం కొనసాగుతోందని ప్రజలు భావిస్తున్నప్పటికీ అత్యాచారాలు ఎందుకు కొనసాగుతున్నాయి అని ఓ సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ సమాధానమిస్తూ.. ‘కూతుళ్లకు మంచి బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లి,తండ్రిపై ఉంది. వారికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలి. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి’ అని అన్నారు. ‘ఎమ్మెల్యేనే కాకుండా నేను ఓ ఉపాధ్యాయుడిని కూడా. అలాంటి సంఘటనలు సంస్కారంతోనే తగ్గుతాయి. కానీ ప్రభుత్వ పాలనతో కాదు. ప్రభుత్వం మహిళలను రక్షించేందుకు కట్టుబడి ఉంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు అమ్మాయిలకు సంస్కారం నేర్పాలి. ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదు’ అని అన్నారు. ప్రస్తుతం ఆ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. 

సురేందర్‌సింగ్‌ ఈ తరహా వ్యాఖ్యాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఒ సందర్భంలో మాట్లాడుతూ గాంధీని చంపిన గాడ్సే ఉగ్రవాది కాదని, అతను చేసింది చిన్న తప్పు మాత్రమే అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే ఆమెను క్రూరమైన మహిళగా అభివర్ణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని