మతమార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’కి యూపీ ఆమోదం
close

తాజా వార్తలు

Published : 24/11/2020 21:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మతమార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’కి యూపీ ఆమోదం

లఖ్‌నవూ: వివాహం కోసం చట్టవిరుద్ధంగా మత మార్పిడులు చేయడానికి వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ‘మతమార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’కి యూపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని మంత్రిమండలి మంగళవారం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. యూపీ మంత్రి ఎస్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లు అమలులోకి వచ్చినప్పటినుంచి చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి 1-5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.15వేల జరిమానా పడుతుందన్నారు. అదే మైనర్లు, దళిత, గిరిజన మహిళలను బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే 3-10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.50వేల జరిమానా పడుతుందని చెప్పారు. ఇకనుంచి ఎవరైనా పెళ్లి కోసం ఇతర మతం మారాలనుకుంటే జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి రెండు నెలల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

ప్రేమ పేరుతో జరిగే బలవంతపు మతమార్పిడులను నివారించేందుకు వ్యూహాన్ని రూపొందించి, ఆర్డినెన్స్‌ తీసుకురావాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని