మత మార్పిడి: యూపీలో తొలి కేసు నమోదు!
close

తాజా వార్తలు

Updated : 29/11/2020 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మత మార్పిడి: యూపీలో తొలి కేసు నమోదు!

లఖ్‌నవూ: బలవంతపు మత మార్పిడిని అరికట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని గవర్నర్‌ ఆమోదించి ఒక రోజైనా గడవక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి కేసు నమోదైంది. ఓ మహిళ మతాన్ని బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణతో ఓ యువకుడిపై బరేలీ జిల్లా, దేవార్నియన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మతం మార్చుకోవాలని ఓ మహిళపై ఉవైష్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఒత్తిడి తేస్తుండటంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నట్లు బరేలీ పోలీసులు వెల్లడించారు.

లవ్‌ జిహాద్‌ పేరుతో వివాహాల కోసం బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ కేబినెట్‌ నవంబర్‌ 24న అత్యవసర ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ ఆర్డినెన్స్‌కు యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆమోదం తెలిపారు. దీని ప్రకారం బలవంతపు మత మార్పిడికి పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధిస్తారు. ఆ మహిళకు రూ.ఐదు లక్షల పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. వివాహానంతరం మత మార్పిడి జరిపితే జైలు శిక్ష, జరిమానా విధించడంతోపాటు, ఆ వివాహాన్ని రద్దు చేస్తారు. ఒకవేళ వివాహం తరువాత ఏ మహిళ అయినా మతం మార్చుకోవాలని భావిస్తే చట్టపరంగా ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని