జియోలో మరో అమెరికా సంస్థ పెట్టుబడులు
close

తాజా వార్తలు

Updated : 08/05/2020 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జియోలో మరో అమెరికా సంస్థ పెట్టుబడులు

ముంబయి: ప్రముఖ అమెరికా సంస్థ ‘విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌’ తమ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెట్టనున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. తమ మధ్య రూ.11,367 కోట్ల మేరకు ఒప్పందం కుదిరినట్టు రిలయన్స్‌ టెలీకాంలో భాగమైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ నేటి ఉదయం వెల్లడించింది. ఈ మేరకు జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 2.32 శాతం వాటాను విస్టాకు బదలాయించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ తెలిపింది. దీనితో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఫేస్‌బుక్‌ల తర్వాత జియోలో విస్టా మూడో అతిపెద్ద వాటాదారు కానుంది.

ఈ విషయమై రిలయస్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ... ‘‘ ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల్లో ఒకటైన విస్టా మా వ్యాపార భాగస్వామి కానుంది. విస్టాను మా సంస్థలోకి ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇతర భాగస్వాముల మాదిరిగానే విస్టాతో కలసి... దేశ ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ డిజిటల్‌ రంగంలో అభివృద్ధిని, పెరుగుదలను సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతాం.’’ అని వివరించారు.

రిలయన్స్‌ జియోలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడం గత నెలరోజుల్లో ఇది మూడో సారి. ఈ ఒప్పందాలతో జియో మూడువారాల వ్యవధిలోనే పెట్టుబడిదారుల నుంచి రూ.60,596.37 కోట్ల మొత్తాన్ని సేకరించినట్లయింది. తొలుత సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లతో 9.99శాతం వాటాల కొనుగోలుకు ఏప్రిల్ 22న జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మే4 న ‘సిల్వర్‌ లేక్‌’ అనే మరో అమెరికన్‌ ఈక్విటీ సంస్థ జియోలో రూ.5656 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ పెట్టుబడులలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో నేడు  ఆ కంపెనీ షేర్‌ ధర 2 శాతానికిపైగా లాభపడింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని