close

తాజా వార్తలు

వాణిజ్య ఒప్పందంపై 15న సంతకం: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో మరో అడుగు పడింది. తమ మధ్య కుదిరిన తొలి వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న రెండు దేశాలు సంతకం చేస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. జనవరి 15న శ్వేతసౌధంలో రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. కార్యక్రమానికి చైనా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరు కానున్నారు. మరోవైపు ఆ తేదీ తర్వాత చైనాతో చర్చలు జరిపేందుకు బీజింగ్‌లో పర్యటించనున్నట్లు ట్రంప్‌ తెలిపారు.

రెండు దేశాల మధ్య కొన్ని నెలలుగా వాణిజ్య యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. పరస్పరం ఆయా దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ భయాలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. తొలి దశ వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు అంగీకారానికి వచ్చాయి. 2020 ఎన్నికల వరకు వేచి చూడకుండా, రెండోదశ ఒప్పంద చర్చలు ప్రారంభిస్తామని కూడా ట్రంప్‌ గతంలో వెల్లడించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.