అన్నింటినీ ఎదుర్కొంటా..! ఉద్ధవ్‌ ఠాక్రే
close

తాజా వార్తలు

Updated : 13/09/2020 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నింటినీ ఎదుర్కొంటా..! ఉద్ధవ్‌ ఠాక్రే

తాజా పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం

ముంబయి: మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. కరోనా వైరస్‌తోపాటు రాజకీయ అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటిని ఎదుర్కొంటానని ఉద్ధవ్‌ స్పష్టంచేశారు. కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం అక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కరోనావైరస్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌, తాజాగా కంగనా వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ భాజపా ఎదురుదాడికి దిగింది. కంగనాపై కాకుండా కరోనావైరస్‌పై పోరాడాలని భాజపా హితవు పలికిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ.. రాష్ట్రప్రజలనుద్దేశించి ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.

రాష్ట్రాంలో ప్రకృతితోపాటు రాజకీయ తుపాన్ల వంటివి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. కరోనావైరస్‌తోపాటు రాజకీయ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటాననే ధీమా వ్యక్తం చేశారు.

కంగనాకు భాజపా మద్దతు దురదృష్టకరం..

ముంబయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌కు భాజపా మద్దతు తెలపడం దురుదృష్టకరమని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ స్పష్టంచేశారు. కేవలం బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే భాజపా ఆమెకు మద్దతు పలుకుతోందని ఆరోపించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ కూడా మౌనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. ముంబయిలో ఉన్న నటులు పేరు ప్రఖ్యాతలు సాధించి, ప్రస్తుతం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. సామ్నా పత్రికలో ప్రత్యేకం వ్యాసంలో ఈ విషయాలు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని