close

తాజా వార్తలు

అట్లాంటాలో వైభవంగా ఉగాది వేడుకలు

అట్లాంటా: అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో ఏప్రిల్‌ 13న ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలకు సుమారు రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే ఆచారి రవి మేడిచెర్ల పంచాంగ శ్రవణం గావించారు. ఈ ఉగాది వేడుకలకు వచ్చిన ప్రతి అందరికీ అట్లాంటా తెలుగు సంఘం ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని శ్రీవికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమీరా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలుగు సినీ గాయని గీతా మాధురి తన పాటలతో ఉర్రూతలూగించారు. ముందుగా పిల్లలకు క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాత్ బౌల్, స్పెల్ మాస్టర్ ఛాలెంజ్ పోటీలలో సుమారు 200 మంది చిన్నారులు పోటీపడ్డారు. పొటీలలో గెలుపొందిన విజేతలకు సంఘం సభ్యులు బహుమతులను అందజేశారు. అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య పాఠశాలలవారు ప్రదర్శించిన సినిమా నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నవారికి సంఘం సభ్యులు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లోని ఆభరణాలు, వస్త్రాలు, ప్రత్యేక ఆహార పదార్థాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులకు ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని, సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాలి, తామా కార్యవర్గ సభ్యులు వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియ బలుసు, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్, బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, ఆనంద్ అక్కినేని, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ ఎలమంచిలి, రాజేష్ జంపాల, రామ్ మద్ది, ఉపేంద్ర నర్రా, శ్రీని బలుసు, విజయ్ కొత్త, విజయ్ కొత్తపల్లి, గిరి సూర్యదేవర, మురళి బొడ్డు, సురేష్ ధూళిపూడి, బాల మడ్డ, అనిల్ కొల్లి, వెంకట్ అడుసుమిల్లి, మహేష్ పవార్, వెంకట్ మీసాల, శ్రీరామ్ రొయ్యల, యశ్వంత్ జొన్నలగడ్డ, హేమంత్ వర్మ పెన్మెత్స, రమేష్ వెన్నెలకంటి, సాన్వి, అక్షు, మోనిష్, తనీష్, రితిక్, రుషీల్, అఖిల్, వంశి కనమర్లపూడి, శ్రీనివాస్ కుక్కడపు, సంతోష్, సరితా, గౌతమి ప్రేమ్, సత్య నాగేందర్, అనిల్, నగేష్ మాగంటి, మూర్తి మొల్లివెంకట, శ్రీనివాస్ గోలి, శ్రీనివాస్ కోడెల, గిరిధర్ కోటగిరి, శశి కేలం, అప్పారావు గోపు తదితరులకు సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.