close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘‘యువ నేతలంటే రాహుల్‌కు అసూయ’’

దిల్లీ: యువ నేతలైన జ్యోతిరాధిత్య సింథియా, సచిన్‌ పైలట్‌ అంటే కాంగ్రెస్‌ నేత రాహుల్‌కు అసూయ అని, అందువల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని భాజపా సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి అన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఆ పార్టీ దుస్థితికి రాహులే కారణమని ఆమె ఆరోపించారు. సచిన్‌ పైలట్‌ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తానంటూ ప్రకటించారు. ఈ మేరకు రాజస్థాన్‌ రాజకీయాల గురించి ఆమె మాట్లాడారు.

‘‘సింథియా, సచిన్‌ ఇద్దరూ గొప్ప నాయకులు. ఇద్దరూ నా మేనల్లుళ్లు లాంటి వారు. ఒక వేళ సచిన్‌ కూడా భాజపాలోకి వస్తానంటే నేను సంతోషిస్తా. ఈ ఇద్దరు నేతలంటే రాహుల్‌కు అసూయ. సచిన్‌ పైలట్‌ వంటి నేతలకు ఒక్కసారి అవకాశం ఇస్తే తనను ఎవరూ పట్టించుకోరన్న రాహుల్‌ అసూయ వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి తలెత్తింది’’ అని ఉమా భారతి అన్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ యువనేత జ్యోతిరాధిథ్య సింథియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయింది. రాజస్థాన్‌లో సైతం సచిన్‌ పైలట్‌ అశోక్‌ గహ్లోత్‌పై అసంతృప్తితో తిరుగుబావుటా ఎగరవేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు ఈ ఇద్దరు యువనేతలు కీలక పాత్ర వహించినప్పటికీ వీరిని కాదని సీనియర్లకు ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టడం వారిలో అసంతృప్తికి కారణమైంది.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని