close

తాజా వార్తలు

Updated : 17/10/2020 08:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రికెట్‌కు ఉమర్‌గుల్‌ వీడ్కోలు

(Photo: Umar gull twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ పేస్‌ బౌలర్ ఉమర్‌ గుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36ఏళ్ల గుల్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ‘నా క్రికెట్‌ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. కృషి, సంకల్పం, నిబద్ధత, గౌరవ విలువలను నేను క్రికెట్‌ నుంచే నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్నేళ్ల నా క్రికెట్‌ ప్రయాణంలో వాళ్లే నాకు స్పూర్తి. వాళ్లు నాకోసం ఎంతో త్యాగం చేశారు. ఇక నుంచి నేను వాళ్లను మిస్‌ అవుతాను’ అని గుల్‌ ఉద్వేగానికి గురయ్యాడు.
2003లో జింబాంబ్వేపై మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు గుల్‌. అదే ఏడాది బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. పాకిస్థాన్‌ తరఫున మొత్తం 47 టెస్టు మ్యాచ్‌లాడిన గుల్‌ 163 వికెట్లు తీశాడు. 130 వన్డేల్లో 179వికెట్లు, 60 టీ20 మ్యాచుల్లో 85 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ 2008 సీజన్‌లోనూ కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో పాకిస్థాన్‌ తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని