కూతురిని హత్య చేయించిన ఆర్థిక ఇబ్బందులు
close

తాజా వార్తలు

Updated : 15/10/2020 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూతురిని హత్య చేయించిన ఆర్థిక ఇబ్బందులు

లఖ్‌నవూ : పేదరికం.. కన్న ప్రేమను మరిచిపోయేలా చేసింది. పిల్లల భవిష్యత్తును అంధకారం చేసి చిదిమేసింది. తల్లి ఆప్యాయతను కూతురికి దక్కకుండా అడ్డుపడింది. ఊపిరి పోసినవారే ప్రాణం తీసేలా చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భేస్‌కీ గ్రామంలో చోటు చేసుంది. 

యూపీలో నివాసం ఉంటున్న ఓ మహిళకు ముగ్గురు పిల్లలు. వారిలో ఆరేళ్ల కుమార్తె ఉంది. పేదరికంతో కుటుంబ పోషణ కష్టమైన ఆ తల్లికి కూతురిపై దిగులు పెరిగింది. భర్త ఓ ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దనే ఉండటంతో కుటుంబ భారమంతా ఆ మహిళపైనే పడింది. ఇద్దరు మగపిల్లలు ఎలాగైనా బతుకు ఈడ్చుకొస్తారనుకున్న ఆ మహిళ.. కూతురు పెరిగి పెద్దదవుతుండటంతో తన భవిష్యత్తు గురించి ఆలోచించి మనోవేదనకు గురైంది. 

తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు తోడు.. ఆడపిల్ల పెంపకం.. అనంతరం పెళ్లి తదితరాలు భారంగా భావించిన ఆ తల్లి కూతురిని హత్య చేసింది. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కూతురిని తనే హత్య చేసినట్లు ఒప్పుకోవటంతో మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని