close

తాజా వార్తలు

Published : 22/11/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్వరలో మార్కెట్‌లోకి కరోనాను నివారించే మౌత్‌వాష్‌!

దిల్లీ: కరోనాను అంతం చేయగల సామర్థ్యం ఉన్న మౌత్‌వాష్‌ను త్వరలో భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనిలివర్‌ ప్రకటించింది. తాము తీసుకురాబోతున్న ఈ మౌత్‌వాష్‌ 30 సెకన్లలో కరోనాను 99.9శాతం అంతం చేస్తుందని తెలిపింది. సీపీసీ టెక్నాలజీతో తయారు చేసిన మౌత్‌వాష్‌లు బాగా పనిచేస్తున్నాయని ఇటీవల తాము జరిపిన అధ్యయనంలో తేలిందని వివరించింది. నోట్లో వైరస్‌ను అంతం చేయడం ద్వారా వ్యాప్తిని బాగా అరికట్టే అవకాశం ఉంటుందని తెలిపింది. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడం, మాస్క్‌ ధరించడం, సామాజిక దూరంతో పాటు త్వరలో మౌత్‌వాష్‌ కూడా తప్పనిసరి నిబంధనల జాబితాలో చేరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 

భారత్‌లో తమ శాఖ అయిన హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ ద్వారా దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూనిలివర్‌ వెల్లడించింది. డిసెంబరు 2020లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 0.07% సెటిల్‌పైరిడీనియమ్‌ క్లోరైడ్‌(సీపీసీ) రసాయనం కలిగి ఉన్న ఏ మౌత్‌వాష్‌ అయినా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలదని ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఓ అధ్యయనం తేల్చిన విషయం తెలిసిందే.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని