
తాజా వార్తలు
గ్రేటర్ ఫలితాలపై అమిత్షా ట్వీట్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో భాజపాపై విశ్వాసం ఉంచినందుకు హైదరాబాద్ ప్రజలకు కేంద్రహోం మంత్రి అమిత్షా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రచారంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడారు. భాజపా కార్యకర్తలు అద్భుత ప్రదర్శన చేశారని అమిత్షా అభినందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా 48 స్థానాలతో గౌరవ ప్రదమైన ప్రదర్శన చేసింది. గత ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన కాషాయ పార్టీ ఈసారి ఊహించనిరీతిలో పుంజుకుంది. మరోవైపు అధికార తెరాస 56, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించాయి.
Tags :