close

తాజా వార్తలు

Updated : 29/11/2020 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేయర్‌ పీఠం భాజపాదే అని నమ్ముతున్నా:అమిత్‌షా

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపాకు అవకాశం ఇస్తే సుపరిపాలన అందిస్తామని.. ఐటీ పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దారిపొడవుగా అంగుళం ఖాళీ లేకుండా తనకు స్వాగతం పలికిన హైదరాబాద్‌ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలుపారు. రోడ్‌షోలో ప్రజల ఆదరణ చూశాక హైదరాబాద్‌ మేయర్‌ పీఠం భాజపాదే అని నమ్ముతున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులిస్తోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. నగరంలోని  నాలాలు, చెరువులపై అక్రమ కట్టడాలు ఉన్నాయని.. గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశారు. తాము వాగ్దానం చేశామంటే అమలు చేసి తీరుతామని అమిత్‌షా చెప్పారు.

నవాబుల నగరం నుంచి ఆధునిక హైదరాబాద్‌గా మారుస్తాం

‘‘తెరాస ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. తెరాస వందరోజుల్లో అభివృద్ధి ప్రణాళిక ఇచ్చి ఐదేళ్లు పూర్తయినా.. అభివృద్ధి మాత్రం జరగలేదు. మురికివాడల్లో పరిస్థితి మారలేదు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు నగరంలోని సుమారు 7లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు రాలేదు?నిజాం నవాబుల నగరం నుంచి ఆధునిక హైదరాబాద్‌గా మారుస్తాం. ఇది మినీ భారత్‌.. దేశంలోని నలువైపుల నుంచి ఇక్కడికి వస్తారు. అనేక ప్రతికూలతలు ఉన్నా దేశం ఆర్థికంగా పురోగమిస్తోంది. మేకిన్‌ ఇండియా ఫలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయి. నగరానికి భవిష్యత్‌లో మరిన్ని ఐటీ సంస్థలు వచ్చేలా చేస్తాం. ఐటీ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.

ఎంఐఎంతో రహస్య ఒప్పందం ఎందుకు?

ప్రధాని మోదీకి పేరొస్తుందనే తెలంగాణలో స్వాస్త్‌ యోజన పథకాన్ని తెరాస ప్రభుత్వం అమలుచేయడం లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ ఫలాలు హైదరాబాద్‌ పేదలకు అందకుండా చేశారు. నగర అభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సాయం చేసింది. కేసీఆర్‌ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్తే కదా కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలిసేది! వరదల వచ్చినపుడు హైదరాబాద్‌కు రెండు విడతల్లో సుమారు రూ.500కోట్ల నిధులిచ్చాం. పేదల ఇళ్లు కట్టేందుకు కేంద్రం రూ.వేల కోట్లు ఇస్తోంది. వీధి వ్యాపారుల పథకాన్ని తెరాస ప్రభుత్వం అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోంది. పరిపాలనా సామర్థ్యం ఇంకెవరికీ లేదా? రాజకీయాల్లో పొత్తులు సహజం.  ఎవరు ఎవరితోనైనా అవగాహన ఒప్పందం పెట్టుకోవచ్చు. ఎంఐఎంతో తెరాసకు రహస్య ఒప్పందం ఎందుకు?బహిరంగంగానే పొత్తు పెట్టుకోవచ్చు కదా? ఇవి గల్లీ ఎన్నికలు అనే వాళ్లు.. గల్లీలను ఎందుకు అభివృద్ధి చేయలేదు? రాష్ట్రంలో రోహింగ్యాలు ఉన్నారని నివేదిక ఇవ్వండి.. నేనేం చేస్తానో చూడండి’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు. Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన