
తాజా వార్తలు
కేసీఆర్ ముఖంలో కళ కనిపించలేదు:కిషన్‌రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొని ఓటింగ్‌శాతాన్ని పెంచాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా భాజపాకు విశేష ఆదరణ లభించిందని.. తెరాస ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలు కోరుకున్న మార్పు భాజపా ద్వారా సాధ్యమవుతుందన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుంటే తాము తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులు, కార్యకర్తలు ఇంటికి వచ్చినా రాకపోయినా పెద్దమనసుతో పోలింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ఓడించాలన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, డబుల్ బెడ్రూం ఇళ్లపై తెరాస నేతలు మాట్లాడటం లేదని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. కుటుంబ రాజకీయాలపై ప్రజలు విసుగుచెందారని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెరాస బహిరంగసభలో కేసీఆర్ మాటల్లో, ముఖంలో కళ కనిపించలేదని వ్యాఖ్యానించారు. దుబ్బాక, హైదరాబాద్‌కు పరిమితమైన భాజపా పోరాటాన్ని ఇకపై ఊరూరా తీసుకెళ్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
