close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 29/07/2020 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్‌లాక్‌ 3.0: జిమ్‌లకు ఓకే.. హాళ్లకు నో!

రాత్రివేళ కర్ఫ్యూ ఎత్తివేత
మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దిల్లీ: కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై ఉన్న నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కంటైన్మెంట్ జోన్ల బయట కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలు కానున్నాయి.

వీటికి అనుమతి..

* లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి దేశంలో కొనసాగిస్తున్న రాత్రివేళ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

* జిమ్‌లు, యోగా కేంద్రాలు ఆగస్టు 5 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది.

* భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఎట్‌ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.

వీటికి అనుమతి లేదు..

* స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాలను ఇప్పుడే తెరిచేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఆగస్టు 31 వరకు వీటిపై ఉన్న నిషేధం యథాతథంగా అమలౌతుందని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

* మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు వంటివి తెరవడంపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది.

* సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టచేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.