#Chiru152: లేటెస్ట్‌ అప్‌డేట్‌!
close

తాజా వార్తలు

Updated : 18/08/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#Chiru152: లేటెస్ట్‌ అప్‌డేట్‌!

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, చిరు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన చిత్ర బృందం నుంచి రానే వచ్చింది.

ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన ప్రీలుక్‌లో ఎర్ర కండువా పట్టుకుని, పిడికిలి బిగించి ఉన్న చేతిని చూపించారు. ఇక ఈ సినిమా పేరును ఇప్పటికే చిరంజీవి ‘ఆచార్య’ అంటూ చెప్పగా, చిత్ర బృందం మాత్రం #Chiru152గానే వ్యవహరిస్తుండటం గమనార్హం. మరి ఆగస్టు 22న విడుదల చేసే ఫస్ట్‌లుక్‌లో ‘ఆచార్య’టైటిల్‌ పెడతారా? లేదా? ఇంకేమైనా ప్రకటిస్తారా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు కొరటాల, ఇటు చిరు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు సుజీత్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని