close

తాజా వార్తలు

Updated : 29/10/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సంచయిత అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది’ 

ఊర్మిళ, సుధా గజపతి మీడియా సమావేశం

విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమ పట్ల మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు వ్యవహరించిన తీరుపై ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఊర్మిళ గజపతి మండిపడ్డారు. గురువారం తమ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన తల్లితో కలిసి ఆమె మాట్లాడారు. పైడితల్లి అమ్మవారి పండగలో ఏటా పాల్గొనటం తమ కుటుంబ సంప్రదాయమన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా సిరిమాను దర్శనానికి తన తల్లితో కలిసి వచ్చానని ఊర్మిళ చెప్పారు.

‘‘వీరిని కోటలోకి ఎవరు అనుమతించారు?అంటూ కోటలోని సిబ్బందిని సంచయిత నిలదీశారు. దీంతో పోలీసులు, మాన్సాస్‌ ట్రస్టు అధికారులు మాపై మండిపడ్డారు. కోటపై ముందు వరుసలో ఉన్న మమ్మల్ని వెనుకకు వెళ్లాలని ట్రస్టు ఈవో చెప్పారు. ఆయన్ను బ్రతిమాలుకొని కొంతసేపు అక్కడే కూర్చొని ఒకసారి సిరిమానును దర్శించుకుని వచ్చేశాం. ఇలాంటి ఘటన జరుగుతుందని ముందే ఊహించాం. అధికారంలో ఉన్న సమయంలో మా తాత, తండ్రి ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. సంచయిత అహంకార పూరితంగా వ్యవహరిస్తోంది. మాన్సాస్‌ ట్రస్టు బోర్డు మెంబర్‌గా కూడా మా అమ్మను ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. ఈ విషయమై అనేకసార్లు మెయిల్స్‌ చేసి ప్రమాణ స్వీకారం కోసం కోరాం. అయినప్పటికీ వారి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు’’ అని ఊర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు.

మాన్సాస్‌ ట్రస్టును సంచయిత తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తోందని సుధా గజపతి ఆరోపించారు. ప్రశ్నించేవారిని కూడా భయపెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు సుధా గజపతి వివరించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.